సంక్రాంతి ఎఫెక్ట్: సిటీలో చికెన్ ధరలు మండెన్..!

| Edited By:

Jan 15, 2020 | 10:49 AM

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చికెన్‌కు భారీగా డిమాండ్ ఉండటంతో.. హైదరాబాద్‌లో ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు అంటున్నారు. దీంతో వ్యాపారులు ముందస్తుగానే భారీగా ఆర్డర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తుండగా.. అందుకోసం ముందుగానే ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు వ్యాపారులు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఘట్‌కేసర్, జీడిమెట్ల, షాద్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర శివారు ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల వద్ద కొనుగోళ్ల సందడి పెరిగింది. హోల్‌సేల్ వ్యాపారులు అక్కడకు వెళ్లి, ఆర్డర్లు […]

సంక్రాంతి ఎఫెక్ట్: సిటీలో చికెన్ ధరలు మండెన్..!
Follow us on

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చికెన్‌కు భారీగా డిమాండ్ ఉండటంతో.. హైదరాబాద్‌లో ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు అంటున్నారు. దీంతో వ్యాపారులు ముందస్తుగానే భారీగా ఆర్డర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తుండగా.. అందుకోసం ముందుగానే ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు వ్యాపారులు.

ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఘట్‌కేసర్, జీడిమెట్ల, షాద్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర శివారు ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల వద్ద కొనుగోళ్ల సందడి పెరిగింది. హోల్‌సేల్ వ్యాపారులు అక్కడకు వెళ్లి, ఆర్డర్లు చేస్తున్నారు. అయితే సాధారణ రోజుల్లోనే గ్రేటర్‌ పరిధిలో లక్షన్నర నుంచి రెండు లక్షల కిలోల వరకు చికెన్‌ అమ్మకాలు జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు సంక్రాంతికి దాదాపు 3 నుంచి 4 లక్షల కిలోల చికెన్‌ అమ్ముడుపోయే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.