మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. నేరానికి కాదేదీ అనర్హం అన్నట్లు ఇన్‌స్టామ్‌గ్రామ్ (Instagram) వేదికగా దొంగనోట్లు సప్లై చేస్తున్నారు. హైదరాబాద్ – చెన్నై మధ్య దొంగనోట్ల మార్పిడి ముఠాను చెన్నై పోలీసులు పట్టుకున్నారు. సోషల్‌మీడియా ఫార్మాట్‌ను అక్రమ మార్గంలో వినియోగించుకుంటూ దొంగనోట్ల మార్పిడి చేస్తున్న ముఠాను చెన్నై పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫేక్ కరెన్సీ ముఠా ఈ మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ టూ చెన్నై ఫాస్ట్ కొరియర్ ద్వారా కొంతకాలంగా ఈ దొంగనోట్ల మార్పిడి జరుగుతోంది. ఇందుకోసం ఓ ఫేక్ కరెన్సీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సృష్టించారు. ఇందులో అనేకమంది యువకులు చేరారు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ ద్వారా ఈ పనిచేస్తే డబ్బులిచ్చేవారు. చెన్నైలోని (Chennai) డీటీసీపీ కొరియర్‌లో వచ్చిన ఈ -పార్శల్ అనుమానాస్పదంగా కనిపించడంతో యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ నుంచి సుజిత్ పేరుతో వచ్చిన ఈ పార్శల్‌లో దొంగనోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చెన్నైకి వచ్చిన అడ్రస్ ఆధారంగా వెల్లచేరికి చెందిన సతీశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
హైదరాబాద్‌కి చెందిన సుజిత్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫేక్ కరెన్సీకి పాల్పడుతున్నాడు. వెయ్యిరూపాయల దొంగనోట్ల మార్పిడికి ఐదువేల రూపాయలు ఇస్తారని పోలీస్ విచారణలో వెల్లడైంది. అతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఫేక్ కరెన్సీ ముఠాపై లోతుగా విచారిస్తున్నారు. హైదరాబాద్ నుంచి దొంగనోట్లు పంపుతున్న సుజిత్ ఫేక్ కరెన్సీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వివరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు చెన్నైలోని ప్రైవేట్ కొరియర్ కంపెనీలపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎంతకాలంగా ఫేక్‌కరెన్సీ దందా కొనసాగుతుందనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..