Hyderabad: ఛీ ఛీ.. మరీ ఇంత కక్కుర్తా.. చెప్పుల దొంగతనం.. షాప్ పెట్టుకుంటాడు కాబోలు
బుద్ది.. అదే గుణం మంచిదైతే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గౌరవం పొందవచ్చు అంటారు పెద్దలు. బద్ది మంచిది కాకపోతే ఎవరూ దగ్గరకు రానివ్వరు.
బుద్ది.. అదే గుణం మంచిదైతే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గౌరవం పొందవచ్చు అంటారు పెద్దలు. బద్ది మంచిది కాకపోతే ఎవరూ దగ్గరకు రానివ్వరు. గతంలో అంటే ఎవరు ఎలాంటి వాళ్లో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం థర్డ్ ఐ(సీసీ కెమెరాలు) వచ్చాక దొంగలందరూ మాగ్జిమమ్ దొరికొపోతున్నారు. సాంకేతికత.. చిన్న తప్పులు చేసినవారిని కూడా పట్టించివేస్తోంది. తాజాగా ఓ వ్యక్తి చేసిన దొంగతనం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
దొంగతనం చేసిన వాళ్లని చెప్పు తీసుకుని కొట్టాలి అని హైదరాబాద్ పాతబస్తీలో అంటుంటారు. ఓ దొంగకి ఆ సూక్తి నచ్చేలేదేమో.. ఆ చెప్పులనే దొంగతనం చేసాడు. అది కూడా ఓ మసీదులో. నమాజు కోసం వచ్చిన వారంతా భక్తిశ్రద్ధలతో ప్రార్థన చేసుకునేందుకు బయట చెప్పులు విప్పి లోపలకి వెళ్లారు. ప్రార్ధనలు ముగించుకొని బయటకు వచ్చి చూస్తే పలువురి చెప్పులు మిస్సయ్యాయి. అతడు చెప్పులు దొంగతనం చేసిన విధానం మాత్రం మరీ దారుణంగా ఉంది. ముందు ప్లాన్ చేసుకుని అక్కడికి వచ్చినట్లు ఉన్నాడు ఆ దొంగ. ఎవరూ లేని సమయం చూసుకుని వెంటనే చెప్పులు విడిచే ప్లేసు వద్ద వాలిపోయాడు. కాస్త బాగున్న మోడల్స్ అన్నింటిని దుస్తుల లోపల దాచేశాడు. అయితే ఒక జత, రెండు జతలు మిస్ అయితే పట్టించుకోకపోయేవారు కానీ.. చాలా జతలు మిస్ అవ్వడంతో అక్కడే ఉన్న సీసీ కెమెరా పుటేజ్ చెక్ చేశారు. ఇంకేముంది సదరు చెప్పుల దొంగ వెలగబెట్టిన బాగోతం మొత్తం బయటపడింది.
–నూర్ మహమ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
Also Read: భర్త ప్రాణంగా పెంచుకుంటున్న చేపను భార్య వేపుకుని తినేసింది.. ఎందుకంటే?
పార్క్‌లో సరదాగా వాకింగ్ చేసేందుకు వెళ్లిన మహిళ.. ఆ రోజుతో ఆమె సుడి తిరిగిపోయింది