Hyderabad: ఖాకీ మాటున కఠినత్వమే కాదు మానవత్వం కుడా ఉందని చాటి చెప్పాడు ఓ పోలీసు ఇన్స్పెక్టర్ (Police Inspector). నిప్పులు చెరుగుతున్న ఎండలో తన కూతురుని ఆస్పత్రికి తీసుకుని వెళ్తున్న ఓ మహిళ పడుతున్న అవస్థకు చలించిపోయాడు. తానే ఆ మహిళను దగ్గరుండి ఆస్పత్రికి తీసుకును వెళ్లి ఆమె కూతురికి వైద్యం చేయించాడు. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
చాంద్రాయణగుట్ట బండ్లగుడ ప్రాంతానికి చెందిన సోహెల్ నేహ దంపతుల 6 సంవత్సరాల కూతురు న్యావి. అయితే న్యావి కి తీవ్రమైన జ్వరం రావటంతో దంపతులు ఎర్రటి ఎండలో నడుచుకుంటూ కూతుర్ని తీసుకుని హాస్పిటల్ కు భయలుదేరింది. ఇది గమనించిన చాంద్రాయణగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ చలించిపోయాడు. వెంటనే స్పందించి ఆ ముగ్గురుని పోలీసు వాహనంలో ఎక్కించుకుని నీలోఫర్ హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాడు. తన సొంత ఖర్చు తో చిన్నారికి చికిత్స చేయించాడు. మానవత్వం తో స్పందించిన సిఐ ప్రసాద్ వర్మకు న్యావి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.