Osmania University: ఉస్మానియా యూనివర్సిటీకి కేంద్రం గుడ్ న్యూస్.. హాస్టళ్ల నిర్మాణానికి నిధులు విడుదల..

|

Oct 07, 2023 | 5:58 PM

Osmania University Hostels: ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టళ్ల నిర్మాణం, వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా రూ.7.5 కోట్లు విడుదల చేసింది. యూనివర్సిటీ విద్యార్థుల కోసం మొత్తం రూ.30 కోట్ల అంచనాతో నిర్మించననున్న..

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీకి కేంద్రం గుడ్ న్యూస్.. హాస్టళ్ల నిర్మాణానికి నిధులు విడుదల..
Osmania University
Follow us on

Osmania University Hostels: ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టళ్ల నిర్మాణం, వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా రూ.7.5 కోట్లు విడుదల చేసింది. యూనివర్సిటీ విద్యార్థుల కోసం మొత్తం రూ.30 కోట్ల అంచనాతో నిర్మించననున్న రెండు హాస్టళ్ల నిర్మాణానికి తొలివిడతగా ఈ నిధులను విడుదల చేసింది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో భాగంగా ప్రధాన మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన (PM AJAY)లో భాగంగా ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం హాస్టళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. బాలికలు, బాలురకు వేర్వేరుగా 500 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు రెండు హాస్టళ్ల నిర్మించనుంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదట రూ. 7.5 కోట్లను విడుదల చేసింది.

ఇటీవల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సమయంలో హాస్టళ్ల దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విని.. వారితో మాట్లాడారు. హాస్టళ్ల నిర్వహణ సరిగ్గాలేని కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి యూనివర్సిటీ వీసీ, ఉన్నతాధిఅధికారులతో మాట్లాడారు. అనంతరం కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌తో మాట్లాడి పరిస్థితి గురించి సవివరంగా వివరించారు. హాస్టల్ భవనాల నిర్మాణం ఆవశ్యకతను వివరించి నిధులు విడుదల చేయాలని కోరారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉస్మానియాలో దాదాపు రూ.30 కోట్ల అంచనాతో రెండు హాస్టల్ భవనాలను యువతులు కోసం, యువకుల కోసం.. హాస్టళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రికి లేఖలు రాయగా.. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ స్పందించి హాస్టళ్ల నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

వందశాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం ఈ హాస్టళ్లను నిర్మించనున్నారు. ఒక్కొక్కదానికి రూ. 14.60 కోట్ల చొప్పున దాదాపు రూ. 30 కోట్ల వ్యయంతో రెండు హాస్టళ్లను నిర్మించనున్నట్లు వీరేంద్ర కుమార్ తెలిపారు. తొలివిడతగా రూ.7.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఈ రెండు నూతన హాస్టళ్లను వీలయినంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..