Telangana: ఇదే చివరి అవకాశం – మళ్లీ ఇచ్చేది లేదు.. రబీ ధాన్యంపై సరఫరాపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

రబీ(Rabi) లో పండించిన ధాన్యాన్ని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఇప్పటికే ఆరు సార్లు గడువు పొడిగించినప్పటికీ.. మరోసారి సమయం పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...

Telangana: ఇదే చివరి అవకాశం - మళ్లీ ఇచ్చేది లేదు.. రబీ ధాన్యంపై సరఫరాపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Minister Kishan Reddy

Updated on: May 04, 2022 | 6:53 PM

రబీ(Rabi) లో పండించిన ధాన్యాన్ని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఇప్పటికే ఆరు సార్లు గడువు పొడిగించినప్పటికీ.. మరోసారి సమయం పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) వెల్లడించారు. మే 31 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గడువు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 18న కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించిన కేంద్రం.. తాజాగా గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. అప్పట్లోగా మిల్లింగ్ పూర్తి చేసి సెంట్రల్ పూల్‌కి బియ్యాన్ని అందజేయాల్సిందిగా తెలిపింది. ఇంతకు మించి మరోసారి పొడిగించడం కుదరదని తేల్చి చెప్పింది. గడువులోగా అందివ్వలేకపోతే మిగిలిన బియ్యానికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించింది. రీసైక్లింగ్ బియ్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్సీఐకి సూచించింది. మిల్లుల వారీగా సెంట్రల్ పూల్‌కి అందించాల్సిన బియ్యంపై పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని కోరింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వివరాలివ్వాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం లేదని.. అవకతవకలు జరిగాయని గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎఫ్‌సీఐ అధికారులు 40 రైస్ మిల్లులో తనిఖీలు చేశారు. 4,53,890 లక్షల సంచుల ధాన్యం తక్కువగా ఉంది. అవి ఎక్కడికి పోయాయే ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గత నెల 13న రాష్ట్ర సివిల్ సప్లై కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణలో ఉన్న బియ్యాన్ని కొనాలని లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం కావాలనే ఘర్షణ వాతావరణం సృష్టించింది. అన్ని రాష్ట్రాలకూ ఒకే న్యాయం ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారమే ధాన్యం కోనుగోలు చేశాము. బాయిల్ రైస్ కోనుగోలు చేయబోమని అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశామని కేంద్ర మంత్రి వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Major : అడవి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే

Andhra Pradesh: సీఎం జగన్ కీలక ప్రకటన.. రైతుల ఖాతాల్లో ఉచిత విద్యుత్ నగదు జమ