బ్రహ్మ కడిగిన పాదానికి బహ్మోత్సవం … ఎంత రమణీయం.. ఎంత మనోహరం…. ఆ సొగసు చూడతరమా….తిరుమల సహా 108 దివ్య దేశాల వైభవం ఒక చోట..మనకళ్లెదుట ఎంత మహత్భాగ్యం. సమతా స్ఫూర్తి వర్ధిల్లేలా భగవ్రదామనుజ అభిషేకోత్సవం జరిగింది. రామానుజ సువర్ణ మూర్తికి పవిత్ర స్నపనంతో బ్రహ్మోత్సవం ప్రారంభమయ్యింది. అచంచల భక్తితో తన మదిని గెలిచిన రామానుజుడికి శ్రీరంగం నుంచి రంగనాథుడు తన మంగళశాసనాలుగా అభయహస్తాన్ని పంపించారు. మన రామానుజ ..గోదాగ్రజులు. తన మొక్కును తీర్చిన అన్నయ్య కోసం శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదమ్మ ..తన అభినందనగా చిలుకలను పంపించారు. తిరుకోష్టూరు నుంచి సాక్షాత్ నారాయణుడు మర్యాద కానుకగా మన రామానుజకు శేషవస్త్రాలను అనుగ్రహించారు. విశ్వేకసేన ఆరాధనతో సమతా కుంభ్ 2023 సమారంభం జరిగింది.
సామాన్యులకు..మాన్యులకే కాదు దేవతాలకూ..విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి కూడా ప్రతిబంధకాలు ఎదురువుతుంటాయి. వాటిని తొలిగించి భగవత్ కార్యాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయం చేసే నాయకుడే విష్ఫక్సేనుడు. అదీ బ్రహ్మోత్సవాల్లో విష్వక్సేనుడి ప్రాముఖ్యత. బెత్తంపట్టి విఘ్నాలు తొలగించడం మాత్రమే కాదు, బ్రహ్మోత్సవాల అంకురారోపణలో మత్ససంగ్రహనం జరిగేదేది విష్షక్సేనుడి ఆధ్వర్యంలోనే.
ముచ్చింతల్ లోని సమతామూర్తి దివ్యక్షేత్రంలో సమతా కుంభ్ – 2023 మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సమతా కుంభ్ 2023 మొదటి రోజు.. సువర్ణమూర్తి భగవద్రామానుజుల వారికి ఉత్సవారం స్నపనం మహోత్సవంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజియర్ స్వామి ఆధ్వర్యంలో.. విశ్వక్సేనుడి ఆరాధన నిర్వహించారు. 10 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు కలగకుండా.. విశ్వక్షేనుడి ఆరాధన నిర్వహించారు. అనంతరం.. యాగశాల వద్ద అంకురార్పణ కార్యక్రమం జరిపారు.
బ్రహ్మోత్సవం… 108 దివ్యదేశాలు కొలువైన మన రామానుజ భవ్య సన్నిధిలో కనులవిందైన మహోత్సవం.. ప్రతీరోజు పండగు..ప్రతీగడియ విశేషమే….ఇల వైకుంఠపురం మన కళ్లెదుట..ఎంత భవ్యం.. మనదెంత భాగ్యం… రండి..దర్శించండి..తరించండి…. వందే గురుపరంపరాం… ఓం నమో నారాయణ….
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి