వీడు మాడూలు కేటుగాడు కాదు.. పలు డేటింగ్ యాప్‌లలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అమాయక అమ్మాయిలను టార్గెట్ చేసి వారితో మాట్లాడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు.. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.. చివరకు రకరకాల కారణాలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తాడు.. ఈ షాకింగ్ ఘటన సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తి పలు డేటింగ్ యాప్ లను కేంద్రంగా చేసుకొని పలువురు యువతులను మోసం చేశాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి..
కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి.. టిండర్, నీతో లాంటి డేటింగ్ యాప్ లలో తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా గూగుల్‌లో పనిచేస్తున్నానని ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. కొంతమంది యువతలను టార్గెట్ చేసి వారి ప్రొఫైల్స్ పై ఇంట్రెస్ట్ చూపించాడు. గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావటంతో సాధారణంగానే పలువురు యువతులు శ్రీనాథ్ ప్రొఫైల్ ను లైక్ చేశారు. అలా లైక్ చేసిన వారితో శ్రీనాధ్ రెడ్డి చాటింగ్ చేసేవాడు.. అలా టచ్ లోకి వచ్చిన యువతులతో మాటలు కలుపుతూ.. పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు.. ఈ క్రమంలోనే యువతులు ఎవరైనా కలుద్దాం.. అని చెప్పగానే.. షూర్ అంటూ నిమ్మించేవాడు.. తీరా కలిసే సమయానికి తన కుటుంబం సమస్యల్లో ఉందని, తన తల్లికి తీవ్ర అనారోగ్య సమస్య ఏర్పడిందని.. ఆర్థిక ఇబ్బందులని.. ఇలా రకరకాల కారణాలు చెప్పి బాధిత యువతుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు.
తీరా అసలు నిజం తెలుసుకున్న యువతులు తామ మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసే క్రమంలో పలువురు యువతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ తరహాలో మోసం చేయడం పట్ల యువతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమనుంచి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని యువతులు పోలీసులకు మొరపెట్టుకున్నారు.
ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. శ్రీనాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. శ్రీనాథ్ రెడ్డి ఇలా తీసుకున్న డబ్బులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని.. ఆన్లైన్ గేమ్స్ ఆడటంతోపాటు.. ఆన్లైన్లో, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..