Senior NTR: ఈ ఫోటోలో ఎన్టీఆర్‌తో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలరా..? ఆయన ప్రజంట్ BRS ఎమ్మెల్యే

|

May 28, 2023 | 1:53 PM

ప్రజలే దేవుళ్లు... సమాజమే దేవాలయం అన్న మహా మనిషి.. ఎన్టీఆర్. తెగువ, సాహసం, పట్టుదల, ఔధార్యం, ఆవేశం ఆయనకు మారు పేర్లు. పేదోళ్లకు పట్టెడన్ను పెట్టిన దేవుడు.. తెలుగు ప్రజల కోసమే ఉద్భవించాడు ఈ రాముడు. ఆయనతో ఫోటోలో ఉన్న వ్యక్తి ప్రజంట్ తెలంగాణలో ఎమ్మెల్యే. ఆయనెవరో మీరు కనిపెట్టగలరా..?

Senior NTR: ఈ ఫోటోలో ఎన్టీఆర్‌తో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలరా..? ఆయన ప్రజంట్ BRS ఎమ్మెల్యే
Senior Ntr
Follow us on

నందమూరి తారకరామారావు…ఈపేరు విన్నా..ఆ కటౌట్ చూసిన తెలుగోడికి గర్వంతో మీసం మెలేస్తాడు. మన జాతి ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన ఈ విశ్వవిఖ్యాతనటసార్వభౌముడు. N.T.R.. ఈ మూడు అక్షరాలు పేరు కాదు.. ఓ ప్రభంజనం.. ఓ సంచలనం.. తెలుగువారి ఆత్మగౌరవం.. ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం.. రాముడిగా, రావణాసుడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా, అర్జునుడిగా వెండితెరకు సొగసులు అద్దిన సమ్మోహన రూపం. తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతార.. రెపరెపలాడిన తెలుగువాడి ఆత్మగౌరవ పతాక.  తెలుగుజాతి దేవుడైన ఈ రాముడు.. నిమ్మకూరునే అయోధ్యగా చేసుకుని ఉదయించాడు.  తెలుగు ప్రజలకు కనిపించిన దేవుడు.. వెండితెరను ఏలిన రాముడు… మన ఎన్టీవోడు. ఆత్మగౌరవం అన్న పేరు కనిపించినా.. వినిపించినా కళ్ల ముందు కదలాడే రూపం ఎన్టీఆర్. నేడు మహానీయుని 100వ జయంతి సందర్భంగా దేశవిదేశాల్లోని తెలుగువారు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు.

ఎన్టీఆర్ స్పూర్తితో ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో యువకులు ప్రొత్సహించి.. రాజకీయాల్లో వారికి ప్రాధాన్యత ఇచ్చారు ఎన్టీఆర్. పైన ఫోటోలోని వ్యక్తిని మీరు గుర్తుపట్టారా..? ఆయన తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. ఎన్టీఆర్ అనుంగ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. వివాదరహితుడిగా పేరుంది. ఇప్పటికే మీకు ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆయన హైదరాబాద్‌లోని అత్యంత ధనిక ప్రాంతమైన జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. గోపినాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని హైదర్‌గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశారు.

మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు. గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు. మాగంటి గోపినాథ్ 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు.  1996 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ స్వర్గస్థులైనపుడు.. ఆయన అస్థికలను హైదరాబాద్ జిల్లాలో జన సందోహం మధ్య ఊరేగించినప్పటి ఫోటో దిగువన ఇచ్చాం చూడండి.