AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: తెలంగాణ భవన్‌కు గులాబీ బాస్.. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వాహణపై చర్చ

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ స్టోరీ చూసేయండి.

KCR: తెలంగాణ భవన్‌కు గులాబీ బాస్.. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వాహణపై చర్చ
Kcr
Ravi Kiran
|

Updated on: Feb 19, 2025 | 3:15 PM

Share

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు సమావేశానికి హాజరయ్యారు.

ఈ నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం మొదట నిర్ణయించింది. అయితే బహిరంగ సభను ఈ నెలలో నిర్వహించడం కన్నా.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నిర్వహిస్తే బాగుంటందాన్న అంశంపై చర్చిస్తున్నారు. అధ్యక్ష ఎన్నిక నాటికి పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికల ని ర్వహణ, సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో అధ్యక్ష ఎన్నిక నిర్వహణ తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణ, అనుసరించే వ్యూహంపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి