BJP Bandi Sanjay: వచ్చే నెలలో హైదరాబాద్‌లో నిర్వహించబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నోవాటెల్ హోటల్ ప్రాంగణాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఈ హోటల్ సందర్శించారు. అక్కడి ఏర్పాట్లు, సదుపాయాలు తెలుసుకున్నారు. జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కానుంది. కొవిడ్ తర్వాత జరుగుతున్న పూర్తిస్థాయి సమావేశమిది. బీజేపీ అధ్యక్షుడు JP నడ్డా ప్రస్తుత పదవీకాలంలో జరుగుతున్న చివరి జాతీయ కార్యవర్గం సమావేశం ఇది. మరింత సమాచారం కోసం ఈ కింది వీడియోను చూడండి.
సమావేశానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై ఆయన నేతలతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమావేశానికి అనుకూలంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.