MP Arvind House Attacked: తెలంగాణలో హీటెక్కిన రాజకీయం.. అర్వింద్‌ వెర్సస్ కవిత..

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. నిజామాబాద్‌ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా సెగలు రేపుతోంది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అరవింద్‌ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌ హీట్‌ను పెంచేశాయి.

MP Arvind House Attacked: తెలంగాణలో హీటెక్కిన రాజకీయం.. అర్వింద్‌ వెర్సస్ కవిత..
Mlc Kavitha Vs Mp Arvind

Edited By:

Updated on: Nov 18, 2022 | 5:46 PM

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. నిజామాబాద్‌ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా సెగలు రేపుతోంది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అరవింద్‌ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌ హీట్‌ను పెంచేశాయి. కాంగ్రెస్‌లో చేరడం కోసం ఎమ్మెల్సీ కవిత ఖర్గేకు ఫోన్‌ చేశారని, కాంగ్రెస్‌ నేత ఒకరు తనకు చెప్పారని వ్యాఖ్యానించారు అర్వింద్‌. దీనిపై ఎమ్మెల్సీ కవిత, టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్వింద్‌ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లో ఆయన ఇంటిపై దాడి చేశారు టీఆర్‌ఎస్‌, జాగృతి కార్యకర్తలు. 50 నుంచి వంద మంది కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లి కుర్చీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పులకుండీలను పగొలగొట్టారు. కర్రలు, రాళ్లతో ఇంటిపై దాడి చేశారు. ఇల్లంతా ధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అర్వింద్‌ వ్యాఖ్యలతో సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు కవిత. నిజామాబాద్‌ చౌరస్తాలో చెప్పుతో కొడతామన్నారు. కొట్టి కొట్టి చంపుతామన్నారు. ఎక్కడ పోటీ చేసినా వెంటాడి వెంటాడి ఓడిస్తానని సవాల్‌ చేశారు కవిత.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Nov 2022 04:40 PM (IST)

    ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి తరుణ్ చుగ్ ఖండన

    బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిని ఆ పార్టీ సీనియర్ నేత తరుణ్ చుగ్ తీవ్రంగా ఖండించారు. ఇది టీఆర్ఎస్ సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. టీఆర్ఎస్ అంతానికి ఇది ఆరంభంగా పేర్కొన్నారు. పార్టీ ప్రతి కార్యకర్త అర్వింద్‌తో నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.

    The attack on Nizamabad MP @Arvindharmapuri house is highly condemnable & it is shameful act by TRS rowdies! This is sign of beginning of end for TRS govt in Telangana. Every Karyakarta of @BJP4India is with Arvind Dharmapuri in fighting against the atrocities of TRS. pic.twitter.com/Z40ju2WDGH

    — Tarun Chugh (@tarunchughbjp) November 18, 2022

  • 18 Nov 2022 04:29 PM (IST)

    బీజేపీ కార్యాలయం ముందు మోహరించిన పోలీసులు

    హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ఎదుట పోలీసులు మోహరించారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని నిరాసిస్తూ BJYM కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ భవన్ ముట్టడికి  BJYM కార్యకర్తలు బయలుదేరారు.  పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.


  • 18 Nov 2022 04:25 PM (IST)

    ఓటమిని జీర్ణించుకోలేకే హింసా రాజకీయం.. నిజామాబాద్ జిల్లా బీజేపీ

    ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిని నిజామాబాద్ జిల్లా బీజేపీ నేతలు ఖండించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జిల్లా అధ్యక్షుడు జస్వలక్ష్మి నర్సయ్య.. బీసీ వర్గానికి చెందిన ఎంపీ మీద దాడి గర్హనీయమన్నారు. టీఆర్ఎస్ హింసా రాజకీయాలకు తెరలేపుతోందని ధ్వజమెత్తారు. ఎంపీ అర్వింద్‌ను చంపేందుకు టీఆర్ఎస్ కుట్రపన్నిందని ఆరోపించారు.కవితను నిజామాబాద్ ప్రజలు ఓడించారని.. దాన్ని జీర్ణించుకోలేకే హింసా రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. బెంగాల్ తరహా రాజకీయాలను తెలంగాణలో ప్రవేశపెట్టాలని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులహంకార, దొరల పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఎంపీ అర్వింద్ ఇంటిపై జరిగిన దాడిలో పోలీసుల పాత్రపై కూడా తేల్చాల్సిన అవసరముందన్నారు. ఎంపీ అర్వింద్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

  • 18 Nov 2022 01:47 PM (IST)

    ఎంపీ ధర్మపురి ఇంటిపై దాడిని ఖండించిన బూర నర్సయ్య గౌడ్

    నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని ఖండించిన బిజెపి బిజేపి నాయకులు, భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. రాజకీయాలలో విమర్శలను ప్రతివిమర్శలతో ఎదుర్కోవాలి. కాని ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఇంట్లోలేని సమయం చూసి వారి ఇంటిపై దాడి చేసి వారి తల్లిని భయభ్రాంతులకు గురి చేయటం అమానుషం.

    ఇలా దాడులకు తిరిగి బిజేపి ప్రతిదాడులు చేస్తే తట్టుకోగలరా. తెలంగాణ రాష్ట్రంలో హింసా రాజకీయాలను ప్రోత్సాహించటం టిఆర్ఎస్ పార్టీకి తగదు. టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసిఆర్ గారు ఎప్పుడూ బిసిలకు వ్యతిరేకమే అనేదానికి ఈ దాడితో ప్రత్యక్షంగా రుజువు అయింది. టిఆర్ఎస్ పార్టీ దాడులలో ఎప్పుడూ బిసిలే బలవుతారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాణహాని ఉంది. ఎంపీ ఇంట్లో లేరని తెలిసి కూడా ఈ దాడికి పాల్పడడం అనేది ఎంత దారుణం.

  • 18 Nov 2022 01:43 PM (IST)

    అర్వింద్ ఇంటిపై దాడిని ఖండించిన డీకే అరుణ

    రాజకీయాల్లో దుర్భాషలాడడం నేర్పిందే కేసీఆర్‌ కుటుంబమని విమర్శించారు బీజేపీ నేత డీకే అరుణ. ఇంట్లోకెళ్లి దాడి చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్‌ ఎలాంటి మార్గనిర్దేశం చేస్తున్నారని ప్రశ్నించారు అరుణ. కేసీఆర్‌ ఆదేశించకుండానే అర్వింద్‌ ఇంటిపై దాడి జరిగిందా అని అన్నారు. తెలంగాణలో పూర్తిగా నియంతృత్వ పాలన సాగుతోందన్నారు.

  • 18 Nov 2022 01:42 PM (IST)

    నన్ను బీజేపీలోకి రమ్మన్నారు: కవిత

    తాను బీజేపీలో చేరాలని అడిగారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. బీజేపీలో తన స్నేహితులు, అనుబంధ సంస్థలు ఈ ప్రతిపాదన తెచ్చాయని తెలిపారు. మహారాష్ట్రలో ఏక్ నాద్ షిండే మోడల్‌‌లో ఈ ప్రపోజల్ తెచ్చారని, అయితే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. తన కూతురు కవితను కూడా బీజేపీలో చేరనున్నారని వ్యాఖ్యానించారు.

  • 18 Nov 2022 01:35 PM (IST)

    అర్వింద్ వెర్సస్ కవిత

    కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేకు కవిత ఫోన్ చేశారు – అర్వింద్‌

    బీఆర్ఎస్‌ కార్యక్రమానికి కవిత ఎందుకు వెళ్లలేదు -అర్వింద్‌

    కాంగ్రెస్‌ వాళ్లకు ఫోన్ చేసినట్టు ఆమె కేసీఆర్‌కి లీక్ ఇచ్చారు -అర్వింద్‌

    బీజేపీ వాళ్లు కవితకు ఫోన్‌ చేశారని కేసీఆర్‌ అన్నారు…

    ఆ ఫోన్‌ కాల్‌ నిజమో కాదో, తేల్చాలి -ఎంపీ అర్వింద్‌
    —–
    నేను ఫోన్ చేశానేమో ఖర్గేను అడగండి -కవిత

    ఇంకోసారి లైన్‌ దాటితే ఊరుకోం.. కొట్టి చంపుతాం -కవిత

    పార్టీ మారతానిని కూతలు కూస్తే చెప్పుతో కొడతా -కవిత

    షిండే మోడల్‌లో బీజేపీకి రమ్మన్నారు.. కాదన్నాను -కవిత

    నేను డీసెంట్‌ పొలిటీషియన్‌ను.. ద్రోహం చేయను -కవిత

  • 18 Nov 2022 01:32 PM (IST)

    దమ్ముంటే నిజామాబాద్ ఎంపీగా కవిత పోటీ చేయాలి: ఎంపీ అర్వింద్

    ఇంట్లోని మహిళా సిబ్బందిని రాయితో కొట్టి దాడి చేయడం ఎందుకోసమని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. ‘నన్ను ఓడిస్తానన్న కవితను ఆహ్వానిస్తున్నా. నేను ఆమెను అన్నదాంట్లో నిజం ఉన్నది కాబట్టే ఇంతలా రియాక్ట్ అయింది. నా తల్లిని భయపెట్టే హక్కు ఎవరికి ఇచ్చారా.? కుల అహంకారంతో మాట్లాడుతున్నావ్ కవిత. ఎవడ్ని బెదిరిస్తున్నావ్.. నేను 2024లో మళ్లీ పోటీ చేస్తా.. రా చూసుకుందాం’ అని అర్వింద్ తీవ్రస్థాయిలో కవితపై మండిపడ్డారు.

  • 18 Nov 2022 01:27 PM (IST)

    ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనకు టీఆర్ఎస్ నేత కౌంటర్

    ఎంపీ అర్వింద్‌పై టీఆర్ఎస్ నేతలు మాటల దాడిని కొనసాగిస్తున్నారు. అర్వింద్ నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌తో పాటు కవిత, స్థానిక నేతలను విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఇంకా జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు.

  • 18 Nov 2022 01:24 PM (IST)

    ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిని ఖండించిన చింతల రామచంద్రారెడ్డి

    ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిని ఖండించారు చింతల రామచంద్రారెడ్డి. టీఆర్ఎస్ ఉన్మాద చర్యలకు దిగటం దుర్మార్గమని.. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీజేపీ నేత చింతల‌ రామచంద్రారెడ్డి ఆరోపించారు.

  • 18 Nov 2022 01:22 PM (IST)

    అర్వింద్‌ ఇంటిపై దాడిని ఖండించిన బండి సంజయ్‌

    నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడిని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఖండించారు. అర్వింద్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నానని సంజయ్‌ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేక.. భౌతిక దాడులకు దిగుతున్నారంటూ టీఆర్ఎస్ మాటల దాడి చేశారు బండి సంజయ్. ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నారు.. బీజేపీ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరంటూ బండి సంజయ్‌ కౌంటరిచ్చారు.

  • 18 Nov 2022 01:19 PM (IST)

    దాడి ఘటనపై పీఎంవో, మోదీకి ఫిర్యాదు చేసిన అర్వింద్‌

    దాడి ఘటనపై ట్విట్టర్‌ వేదికగా ఎంపీ అర్వింద్‌ స్పందించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత ఆదేశాలతో తన ఇంటిపై టీఆర్‌ఎస్‌ గూండాలు దాడి చేశారని పేర్కొన్నారు. ఇంట్లో వస్తువులను పగులగొట్టి బీభత్సం సృష్టించారని తెలిపారు. మా అమ్మను బెదిరించారంటూ పీఎంవో, మోదీకి ట్విట్టర్ వేదికగా అర్వింద్‌ ఫిర్యాదు చేశారు

  • 18 Nov 2022 01:18 PM (IST)

    అర్వింద్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు…

    అర్వింద్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అనవసర వ్యాఖ్యలు చేస్తే కొట్టి కొట్టి చంపుతామని కవిత ఫైర్ అయ్యారు. నిజామాబాద్‌ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తానని కవిత సవాల్ విసిరారు. తాను ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరతానని చెప్పానా అంటూ ఆమె ప్రశ్నించారు. అర్విందే కాంగ్రెస్‌ వాళ్లతో టచ్‌లో ఉన్నారని కవిత విమర్శించారు.

  • 18 Nov 2022 01:15 PM (IST)

    ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

    బీజేపీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హైదరాబాద్‌లోని అర్వింద్ ఇంటిపై దాడి చేశారు. కారు అద్దాలు, ఇంట్లోని ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.