Bhanzu: సిరీస్‌ ఏ ఫండింగ్‌లో 15 మిలియన్‌ డాలర్లను సమీకరించిన భాన్జు.. మ్యాథ్‌ భయాన్ని పోగొట్టేందుకు..

|

Sep 23, 2022 | 6:20 AM

Neelakantha Bhanu Prakash: హైదరాబాద్ సంస్థ అయిన అంతర్జాతీయ గణిత (మ్యాథ్‌) అభ్యాస వేదిక భాన్జు (Bhanzu) ను 2020లో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ (హ్యూమన్‌) కాలిక్యులేటర్‌గా గుర్తింపుపొందిన నీలకంఠ భాను ప్రకాష్‌ ప్రారంభించారు. ఈ సంస్థ 15 మిలియన్‌ డాలర్లను సిరీస్‌ ఏ ఫండింగ్‌లో భాగంగా సమీకరించినట్లు ప్రకాష్ గురువారం వెల్లడించారు. ఈ రౌండ్‌ ఫండ్‌కు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్ధ, ఎయిట్‌ రోడ్స్‌ వెంచర్స్‌ నేతృత్వం వహించింది. ఈ రౌండ్‌లో మరో అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ […]

Bhanzu: సిరీస్‌ ఏ ఫండింగ్‌లో 15 మిలియన్‌ డాలర్లను సమీకరించిన భాన్జు.. మ్యాథ్‌ భయాన్ని పోగొట్టేందుకు..
Neelakantha Bhanu Prakash
Follow us on

Neelakantha Bhanu Prakash: హైదరాబాద్ సంస్థ అయిన అంతర్జాతీయ గణిత (మ్యాథ్‌) అభ్యాస వేదిక భాన్జు (Bhanzu) ను 2020లో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ (హ్యూమన్‌) కాలిక్యులేటర్‌గా గుర్తింపుపొందిన నీలకంఠ భాను ప్రకాష్‌ ప్రారంభించారు. ఈ సంస్థ 15 మిలియన్‌ డాలర్లను సిరీస్‌ ఏ ఫండింగ్‌లో భాగంగా సమీకరించినట్లు ప్రకాష్ గురువారం వెల్లడించారు. ఈ రౌండ్‌ ఫండ్‌కు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్ధ, ఎయిట్‌ రోడ్స్‌ వెంచర్స్‌ నేతృత్వం వహించింది. ఈ రౌండ్‌లో మరో అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ బీ క్యాపిటల్‌ సైతం పెట్టుబడులు పెట్టింది. ఈ సమీకరించిన నిధులను తమ సాంకేతిక మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంతో పాటుగా అసాధారణ విద్యార్ధి అభ్యాస అనుభవాలను సృష్టించేందుకు, మరింత ఆసక్తికరంగా, ఫలితాలను లక్ష్యంగా చేసుకున్న కంటెంట్‌తో తమ గణిత పాఠ్యాంశాలు (మ్యాథ్‌ కరిక్యులమ్‌)ను బలోపేతం చేసేందుకు భాన్జు వినియోగించనుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. గతంలో ఎన్నడూ గణితాన్ని ఆస్వాదించని విద్యార్థులు సైతం గణితాన్ని ఆస్వాదించేలా, గణితంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూనే సామాన్య శాస్త్రము (సైన్స్‌), గణితము (మ్యాథ్స్‌) భవిష్యత్‌లో ఇంజినీరింగ్‌ లో కెరీర్‌ పరంగా అత్యున్నత ప్రదర్శన చేసేందుకు తోడ్పడేలా దీనిని తీర్చిదిద్దినట్లు తెలిపారు.

భాన్జు వ్యవస్థాపకులు, సీఈవో నీలకంఠ భాను.. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా గుర్తింపు పొందారు. శకుంతల దేవి మ్యాథ్‌ రికార్డ్‌లను సైతం ఇతను బద్దలుకొట్టారు. 2020లో అతను యావత్‌ దేశానికి గర్వకారణంగా నిలుస్తూ మైండ్‌ స్పోర్ట్స్‌ ఒలింపిక్స్‌ వద్ద భారతదేశపు తరపున మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ను సాధించారు. ఆ తరువాత, భాన్జును భాను ప్రారంభించారు. ఇది గణిత అభ్యాస వేదిక. గణితమంటే ఉన్న భయాన్ని పోగొట్టే దిశగా ఇది కృషి చేస్తుంది.

ఫండింగ్‌ గురించి వేగవంతమైన హ్యూమన్‌ కాలిక్యులేటర్‌, భాన్జు సీఈఓ నీలకంఠ భాను మాట్లాడుతూ ‘‘సరైన అభ్యాస పద్ధతులతో గణితాన్ని అభ్యసించే సామర్థ్యం మన దేశంలో ప్రతి చిన్నారికీ ఉందని నేను నమ్ముతున్నాను. నా గణిత పాఠ్యాంశాలు, విద్యార్థులకు గణితమంటే ఉన్న భయాన్ని పొగొట్టడంతో పాటుగా సైన్స్‌, ఇంజినీరింగ్‌ వంటి రంగాలలో కెరీర్‌లను ఎంచుకునేలా వారికి స్ఫూర్తినందిస్తుంది. భారతదేశంలో ఆర్యభట్ట మొదలు రామానుజన్‌ నుంచి శకుంతల దేవి వరకూ గణిత మేధావులెందరో ఉన్నారు. ఊహాతీత సామర్ధ్యాన్ని భారతీయ మేధావులు కలిగి ఉన్నారు. మరింత మంది భారతీయులు తమ అసలైన సామర్ధ్యం గుర్తించేలా చేయాలని భాన్జు కోరుకుంటుంది. ఈ లక్ష్యం సాధించడానికి అత్యుత్తమ సామర్థ్యం గణితానికి ఉంది. భాన్జు గణిత కోర్సులతో, ప్రతి విద్యార్థి సరైన మార్గంలో గణితం అభ్యసించడం ప్రారంభించడం మాత్రమే కాదు, ఆ గణితాన్ని అభిమానిస్తారు’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కంపెనీ 6 నుంచి 16 సంవత్సరాల లోపు విద్యార్థులకు గణితంలో అభ్యాస కార్యక్రమాలను అందిస్తుంది. విద్యార్థులు నాలుగు రెట్లు వేగంగా, ఉత్తమంగా లెక్కలు చేసేందుకు విద్యార్థులకు సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా విద్యార్థులకు అభిజ్ఞా సామర్థ్యం మెరుగుపరుచుకునేందుకు అవసరమైన, సరైన పునాదిని వేయడంలో తోడ్పడుతుంది. భాన్జు పాఠ్యాంశాలను విస్తృత స్ధాయి డాటా సేకరణ, నాలుగు సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనల ఆధారంగా నీలకంఠ భాను వ్యక్తిగతంగా తీర్చిదిద్దారు. బాటమ్‌ అప్‌ విధానాన్ని రూపొందించడం ద్వారా గణిత అభ్యాసం యొక్క పునాదిని ప్రశ్నించడం చుట్టూ ఇది తిరుగుతుంది.

విద్యార్ధులు ఎదుర్కొంటున్న భారీ సవాళ్లను భాన్జు పరిష్కరిస్తుంది మరియు ప్రతి చిన్నారి ఆస్వాదించదగిన గణిత అభ్యాస అనుభవాలను అందిస్తుంది. వినూత్న అభ్యాస పద్ధతులతో గణితంపై ప్రేమను పెంపొందించడానికి, ప్రపంచంలోనే అత్యంత ఆలోచనాత్మకమైన, సంపూర్ణ గణిత పాఠ్యాంశంగా నిలిచేలా భాన్జు సృష్టించారు. గణితాన్ని వినోదాత్మక క్రీడగా మలచడంతో పాటుగా దానిని ప్రధాన స్రవంతి సంస్కృతిలో అంతర్భాగం చేయడం ద్వారా గణితమంటే ఉన్న భయాన్ని పోగొట్టడానికి కృషి చేస్తున్నట్లు భాను తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం