Hyderabad: అడ్డంగా ఉన్నాయని నరికేస్తామంటే కుదరదు.. చెట్టుపై చేయి వేయాలంటే అనుమతి తప్పనిసరి..

Hyderabad: ఇంటి వెలివేషన్‌కు చెట్టు అడ్డుగా ఉందని, కార్కు పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఇష్టారాజ్యంగా చెట్లను నరికేస్తామంటే కుదరదని చెబుతున్నారు అధికారులు. ఈ విషయమై వృక్ష పరిరక్షణ కమిటీ అధ్యక్షులు...

Hyderabad: అడ్డంగా ఉన్నాయని నరికేస్తామంటే కుదరదు.. చెట్టుపై చేయి వేయాలంటే అనుమతి తప్పనిసరి..
Trees Cutting

Updated on: Apr 12, 2022 | 3:31 PM

Hyderabad: ఇంటి వెలివేషన్‌కు చెట్టు అడ్డుగా ఉందని, కార్కు పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఇష్టారాజ్యంగా చెట్లను నరికేస్తామంటే కుదరదని చెబుతున్నారు అధికారులు. ఈ విషయమై వృక్ష పరిరక్షణ కమిటీ అధ్యక్షులు పత్రిక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌, మేడ్చట్, రంగారెడ్డి పరిధిలో ఉన్న ప్రజలందరికీ పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేశారు.

ఇందులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. ‘తెలంగాణ ప్రభుత్వ వాల్టా చట్టం 2005 ప్రకారం, ఎవరైనా పౌరులు లేదా సంస్థలు తమ స్థలములలో ఉన్న చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేయడం లేదా స్థల మార్పిడి చేయడం కుదరదు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘tgfmis.com’ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని అధికారి నుంచి అనుమతి పొందాలి. అనంతరమే చెట్లను నరికే అవకాశం ఉంటుంది. అయితే కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికివేస్తున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రీ ప్రొటెక్షన్‌ కమిటీ దృష్టికి ఫిర్యాదులు వచ్చాయి. ఇది ముమ్మాటికీ చట్టరిత్యా నేరం. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించి. చెట్లను నరికే ముందుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

అసలేంటీ వాల్టా చట్టం..

సమస్త మానవాళికి చెట్లకు విడదీయలేని సంబంధం ఉంది. మనుషులకు చెట్లు చేసే మేలు అంతా ఇంత కాదు. సహజంగా ఆక్సిజన్‌ అందించే చెట్లను నరికేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం. అయితే ఇలాంటి వాటికే చెక్‌ పెట్టడానికి.. నీరు, భూమి, చెట్టు పరిరక్షణ చట్టాన్ని (వాల్టా యాక్ట్-2002) తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం వృక్షాలు, చెట్లను ఇష్టారాజ్యంగా నరకకూడదు. ఒకవేళ చెట్లు నరికితే 30 రోజుల్లో ఒక చెట్టుకు రెండు మొక్కల చొప్పన నాటి వాటిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టం కార్యరూపం దాల్చుతుందా అంటే కచ్చితంగా అవుననే సమాధానం మాత్రం రావడం లేదు. కొందరు ఇష్టారాజ్యంగా చెట్లను నరికేస్తున్నారు.

Also Read: Iron Deficiency: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ఐరన్‌ లోపమే..!

Travel Tips: భారతదేశంలో ఉన్న ఈ అందమైన రైల్వే స్టేషన్లను చూశారా ?.. ఎక్కడున్నాయంటే..

AP Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. విడిపోయి మళ్లీ కలిశారు.. చివరకు భర్తపై పెట్రోల్ పోసి..