Telangana: తెలంగాణకు పెట్టుబడుల వరద.. ముందుకొచ్చిన మరో పెద్ద కంపెనీ.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి KTR..

తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-వేస్ట్‌ రీసైక్లింగ్‌ సంస్థ అట్టెరో ఇండియా సోమవారం వెల్లడించింది.

Telangana: తెలంగాణకు పెట్టుబడుల వరద.. ముందుకొచ్చిన మరో పెద్ద కంపెనీ.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి KTR..
Attero India invest in Telangana

Updated on: Oct 31, 2022 | 8:08 PM

తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-వేస్ట్‌ రీసైక్లింగ్‌ సంస్థ అట్టెరో ఇండియా సోమవారం వెల్లడించింది. కొత్త ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయడం ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా, మరికొందరికి పరోక్షంగా ఉపాధి కల్పించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ (కే తారక రామారావు) తో సమావేశం అనంతరం.. అట్టెరో ఈ ప్రకటన చేసింది. దీనిపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎర్ర తివాచీ పరుస్తోందంటూ వెల్లడించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్.. అట్టెరో ప్రతినిధులతో భేటీ అయిన ఫొటోలను షేర్ చేస్తూ ట్విట్ చేశారు.

తెలంగాణలో అట్టెరో సంస్థ రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంస్థ 300 మందికి పైగా ప్రత్యక్షంగా.. అనేక మందికి పరోక్షంగా ఉపాధిని అందించనుందని ట్విట్ లో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

కాగా.. తెలంగాణలో ఇటీవల రెండు సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపెనీలు జినోమ్‌ వ్యాలీలో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఇందులో రూ. 400 కోట్లతో తయారీ పరిశ్రమను గ్రాన్యూల్స్‌ ఇండియా నెలకొల్పనుండగా.. తయారీ రంగంలోనే లారస్‌ ల్యాబ్స్‌ రూ. 300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వీటితో రాష్ట్రంలో 1,750 మందికి పైగా ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..