Hyderabad: డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ ఈగల్ టీంకు చిక్కిన ఏపీ ఎమ్మెల్యే కుమారుడు..
ఏపీ ఎమ్మెల్యే తనయుడు డ్రగ్స్ వినియోగిస్తూ హైదరాబాద్ ఈగల్ టీంకు చిక్కాడు. గంజాయి తీసుకుంటూ కడప జిల్లా జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి దొరికాడు. డ్రగ్స్ టెస్ట్‌లో సుధీర్‌రెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదినారాయణ రెడ్డి.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టీడీపీ మంత్రిగా పనిచేశారు.

Ganja
ఏపీ ఎమ్మెల్యే తనయుడు డ్రగ్స్ వినియోగిస్తూ హైదరాబాద్ ఈగల్ టీంకు చిక్కాడు. గంజాయి తీసుకుంటూ కడప జిల్లా జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి దొరికాడు. పక్కా సమాచారం అందడంతో.. ఇంటికి వెళ్లి డ్రగ్స్ టెస్ట్ చేయగా… సుధీర్‌రెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో రెండుసార్లు డ్రగ్స్ కేసులో సుధీర్ రెడ్డి పట్టుబడినట్లు సమాచారం. సుధీర్ రెడ్డిని డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. డ్రగ్స్ ఎవరు సప్లయ్ చేశారన్న కోణంలో పోలీసుల ఆరా తీస్తున్నారు. సుధీర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టీడీపీ మంత్రిగా పనిచేశారు.
