మియావ్ మియావ్ పిల్లి.. ఎక్కడున్నావే తల్లి.. వెతికిపెడితే రూ. 30 వేల నజరానా..

|

Jul 29, 2021 | 12:58 PM

Cat Missing: తాను ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న పిల్లి కనిపించలేదంటూ కేసు కూడా పెట్టాడు. వెటర్నరీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తాను పెంచుకునే పిల్లి అదృశ్యమైందని ప్రెస్ మీట్ పెట్టారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మియావ్ మియావ్ పిల్లి.. ఎక్కడున్నావే తల్లి.. వెతికిపెడితే రూ. 30 వేల నజరానా..
Cat Missing
Follow us on

పెంపుడు జంతువులు అంటే చాలా మందికి ప్రాణం. అంతేకాదు వాటి కోసం వారు ఎంత ఎంతకైన తెగిస్తారు.. ఎంత దూరమైనా వెళ్తారు. ఇక వాటి పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలిస్తే మరింత షాక్ అవుతాము. వాటిని చిన్నగా జ్వరం వస్తే.. పెంపకందారులు అల్లాడి పోతారు. అలాంటిది అది తప్పిపోతే ఇంకేమైనా ఉందా.. గల్లీ.. గల్లీ చుట్టేస్తారు. అంతా వెతికేస్తారు. దాని కోసం వెతుకుతుంటారు. ఇంతటితో ఆగిపోలేదు ఓ జంతు ప్రేమికురాలు. పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కారు. తాను ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న పిల్లి కనిపించలేదంటూ కేసు కూడా పెట్టారు. టోలిచౌకిలోని వెటర్నరీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తాను పెంచుకునే పిల్లి అదృశ్యమైందని ప్రెస్ మీట్ పెట్టారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందులో పని చేస్తున్న పూర్తి స్థాయిలో ట్రైన్ కాదని మండిపడుతున్నారు.

ఇక వివరాలను పరిశీలిస్తే.. సికింద్రబాద్‌లో నివాసం ఉంటున్న సెరునా నెట్టో కొంత కాలంగా ఓ పిల్లిని(జింజర్) (Ginger) పెంచుకుంటోంది. అయితే ఈ మధ్యకాలంలో జింజర్‌ వైద్య చికిత్స కోసం గత నెల 24 టోలిచౌకిలోని ట్రస్టీ వెట్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. చేర్పించిన తర్వాత నుంచి అది కనిపించకుండా పోయింది. తన పెంపుడు పిల్లి ఎక్కడా అని అడిగే వారి నుంచి జవాబు లేదని తెలిపారు. రోజుల పాటు వారి ఆస్పత్రి చుట్టు తిరిగినా పిల్లిని ఇవ్వకపోగా, పోంతన లేని సమాధానాలు చెప్పారని ఆందోళన వ్యక్తం చేశారు.

Cat Missing 1

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం జూన్ 17 న ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సెరీనా నాటో చెప్పారు. దీంతో మూడు రోజుల పాటు తిరిగి చివరికి గట్టిగా నిలదీయడంతో పిల్లి ఎక్కడికో పారిపోయిందని చెప్పారు. దీంతో పిల్లి అదృశ్యంపై ఆవేదన చెందారు.

దీంతోపాటు పిల్లిని తెచ్చి ఇచ్చిన వారికి 30 వేల రుపాయల బహుమతి కూడ ఇస్తానని సెరునా నెట్టో మీడియాకు తెలిపారు. అంతే కాదు ఆ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆధికారులను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి: Marine Srinivas: మిస్టరిగా మైరెన్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..

Jhunjhunwala New Plan: బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కొత్త ప్లాన్.. సామాన్యుల కోసం ప్రత్యక్ష వ్యాపారంలోకి..

TS Transco Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. JLM పోస్టులకు రూట్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..