Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..
Rain Alert

Updated on: Dec 05, 2025 | 7:07 AM

బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ వెదర్ రిపోర్ట్..

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నుంచి రాష్ట్రంలో రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వెల్లడించింది. గాలిలో తేమ తగ్గడం వల్ల రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరుగుతుందని వెల్లడించింది.

ఏపీలో పిడుగులతో కూడిన వానలు..

ఇదిలాఉంటే.. ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అయితే.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇది కూడా చదవండి..

Optical Illusion Test: మీ ప్రతిభకు సవాల్.. ఈ చిత్రంలో దాగున్న జింకను 10 సెకన్లలో కనిపెట్టగలరా..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..