AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దేవుడు పిలుస్తున్నాడంటూ.. కుటుంబం మొత్తం..! ఆ ఘటనే వారి మనసులను మెలి పెట్టిందా..?

అంబర్‌పేట ఫ్యామిలీ విషాదానికి కారణమేంటి? పెద్దకూతురి మరణంతో డిప్రెషన్‌కి లోనయ్యారా? మూఢనమ్మకంతోనే చిన్న కూతురితో పాటు బలవన్మరణానికి పాల్పడ్డారు. బిడ్డ మరణానికి తోడు.. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ దారుణానికి దారితీశాయా? అయినవాళ్లకు దూరంగా ఇన్నాళ్లూ ఒంటరిగా ఎందుకు బతికారు? చివరికి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు?

Hyderabad: దేవుడు పిలుస్తున్నాడంటూ.. కుటుంబం మొత్తం..! ఆ ఘటనే వారి మనసులను మెలి పెట్టిందా..?
Family Suicide
Ram Naramaneni
|

Updated on: Nov 23, 2025 | 7:30 PM

Share

పెద్దకూతురి మరణం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. ఆ ఇంట్లో కూతురి జ్ఞాపకాలు వెంటాడుతుంటే.. బరువెక్కిన గుండెలతో ఇల్లు మారింది. కానీ అక్కడ కూడా కూతురిని మరిచిపోలేక కన్నవారు, అక్క జ్ఞాపకాలతో చెల్లెలు కొత్త చోట కూడా కుమిలిపోయారు. చుట్టుపక్కలవారితో మాటలైనా కలపకుండా మౌనంగా ఉండిపోయారు. అయినవాళ్లుండీ ఒంటరిగా బతికారు. చివరికి ఈ లోకాన్ని వీడాలనే నిర్ణయానికొచ్చారు.

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ మల్లికార్జుననగర్‌లో జరిగిందీ దారుణం. శ్రీనివాస్, తని భార్య విజయలక్ష్మి, వారి పదేళ్ల చిన్న కూతురు శ్రావ్య బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవలే పెద్ద కూతురి మరణంతో కుటుంబం తీవ్ర డిప్రెషన్‌కు లోనైంది. ఆర్థిక ఇబ్బందులకు తోడు తమను కూడా దేవుడు పిలుస్తున్నాడనే మూఢనమ్మకంతో పాటు ఈ దారుణ నిర్ణయం తీసుకుందా కుటుంబం. ఒకేసారి ముగ్గురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఘటనతో కాలనీవాసులు షాక్‌కు గురయ్యారు.

గతంలో రాంనగర్‌లో ఉండేదిశ్రీనివాస్ కుటుంబం. కొన్ని నెలల క్రితమే అంబర్‌పేట్‌కు నివాసం మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురు కావ్య అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తమను కూడా దేవుడు పిలుస్తున్నాడని.. కొందరితో దంపతులు చెబుతూ వస్తున్నారు. ఫోన్‌ కూడా ఎత్తకపోవటంతో శ్రీనివాస్‌ సమీప బంధువులు ఆ ఇంటికి వచ్చిచూసేసరికి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం వెలుగుచూసింది.

శ్రీనివాస్‌ మెయిన్‌డోర్ వెంటిలేటర్‌కు, భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావ్య గదిలో కిటికీ ఇనుప చువ్వలకు చీరలతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రెండ్రోజుల క్రితమే చనిపోవడంతో మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో కూడా పెద్ద కూతురు దగ్గరికి వెళ్తున్నామనే విషయాన్ని దంపతులు రాసినట్లు చెబుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్న కుటుంబం రాంనగర్‌కి వచ్చినప్పట్నించీ బంధువులకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆత్మహత్యలలో డిప్రెషన్‌దే కీరోల్‌ అంటున్నారు సైక్రియాటిస్టులు కూడా.

కూతురిని కోల్పోయిన కుటుంబానికి ఆత్మీయుల్లో ఎవరైనా అండగా నిలిచి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదేమో. తెలిసినవాళ్లెవరయినా ధైర్యం చెబితే ఆ కుటుంబం మళ్లీ మామూలు స్థితికి వచ్చుండేదేమో. కానీ ఆ కుటుంబమే స్వీయ బందీఖానాలో ఉండిపోయింది. ఎవరన్నా చెప్పారో, వాళ్లంతటవాళ్లే ఓ నిర్ణయానికొచ్చారోగానీ.. స్వర్గంలో ఉన్న కూతురి దగ్గరికెళ్తే సమస్యలన్నీ తీరిపోయానుకుంది. కనీసం చిన్నకూతురినైనా కళ్లలో పెట్టుకుని చూసుకుంటూ నిబ్బరంగా బతుకుతామనే ధైర్యం చేయలేకపోయింది. మూఢనమ్మకమో, కన్నపేగుతో ఉన్న అనుబంధమోకానీ ఆ కుటుంబం తనకు తానే మరణశిక్ష విధించుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..