
Ind-Aus T20 match: హోరాహోరీగా సాగుతున్న సిరీస్‌లో కీలక మ్యాచ్‌లో హైదరాబాద్‌లో జరగబోతోంది. నిర్ణయాత్మక మూడో టీ20 సండే ఉప్పల్(Uppal )లో జరగబోతోంది. దీంతో అభిమానులకు దసరా ముందే వచ్చింది. తొలి టీ20లో షాక్ తిన్న టీమిండియా రెండో టీ20లో పుంజుకుంది. విదర్భలో జరిగిన 8 ఓవర్ల మ్యాచ్‌లో ఆరంభంలో తడబాటుకి గురైనప్పటికీ ముగింపులో తేడా రాకుండా చూసుకుంది. చివరకు గెలుపు టీమ్ ఇండియాను వరించింది. ఇప్పుడు సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 కోసం ఉప్పల్ స్టేడియం రెడీగా ఉండి. ఆదివారం రాత్రి ఏడుగంటలకు మ్యాచ్ ప్రారంభమవుతోంది. ఇప్పటికీ మ్యాచ్ నిర్వహణ కోసం గ్రౌండ్ రెడీ కాలేదు. ఏర్పాట్లలో HCAనిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. టికెట్ల అమ్మకాలపై ఇప్పటికే తీవ్రమైన విమర్శుల ఎదుర్కొన్న HCA మ్యాచ్‌నైనా సరిగ్గా నిర్వాహిస్తుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇటు ఉప్పల్ మ్యాచ్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 2500 మంది పోలీసులను సెక్యూరిటీ కల్పిస్తున్నారు. 300 వరకు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్‌కు కనెక్ట్ చేశారు. గత అనుభవాలతో ఎయిర్‌పోర్టు నుంచి ఆటగాళ్లు స్టేడియం చేరేవరకూ పోలీసులు కట్టదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మ్యాచ్ చూడ్డానికి వెళ్లే క్రికెట్ ఫ్యాన్స్‌కు సైతం కీలక సూచనలు చేశారు రాచకొండ పోలీసులు. పలు వస్తువులు స్టేడియంలోకి తీసుకెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. అవేంటో తెలుసుకుందా పదండి
ఈ లిస్ట్‌లోని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండ్‌లోకి అనుమతించమని రాచకొండ పోలీసులు స్పష్టం చేశారు. క్రీడాభిమానులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రావాలన్నారు. పోలీసులకు సహకరిస్తూ మ్యాచ్ ఎంజాయ్ చేయాలని కోరారు.
Carrying these items inside the #stadium is strictly #prohibited. #INDvsAUS #3rdt20#INDvsAUST20I #Cricket #T20Cricket #HyderabadCricketAssociation #T20I #RohitSharma #ViratKohli? #TeamIndia @TelanganaDGP @TelanganaCOPs @BCCI @cyberabadpolice @hydcitypolice @VSrinivasGoud pic.twitter.com/WZYk2Ru2UN
— Rachakonda Police (@RachakondaCop) September 23, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..