Asaduddin Owaisi: మీ బుద్ధి మారాలి.. పాకిస్తానీలు నన్ను బాగా ఫాలో అవ్వండి- అసదుద్దీన్!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ పాక్ వ్యతిరేకంగా విమర్శలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీకి వేధింపులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. పాక్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన అసదుద్ధీన్‌ను టార్గెట్ చేసిన పాక్ ప్రభుత్వం సోషల్‌ మీడియాలో అతనికి వ్యతిరేకంగా పోస్ట్‌ పెడుతూ రెచ్చిపోయింది. దీనికి అసదుద్దీన్‌ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్‌కు భారత్‌లో అందమైన పెళ్లికొడుకును నేనే అయ్యానంటూ సోషల్ మీడియా వేదికగా ఓవైసీ తన గొంతు వినిపించారు. నన్ను బాగా ఫాలో అవ్వాలని, నా వ్యాఖ్యలు వినైనా మీ బుద్ధి మారాలని కోరుకుంటున్నానని పాకిస్థాన్‌ను వ్యంగంగా విమర్శించారు.

Asaduddin Owaisi: మీ బుద్ధి మారాలి.. పాకిస్తానీలు నన్ను బాగా ఫాలో అవ్వండి- అసదుద్దీన్!
Asaduddin Owaisi

Edited By: Anand T

Updated on: May 17, 2025 | 7:37 PM

జమ్మూకశ్మీర్-పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దేశం మొత్తం వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పలు రాజకీయ పార్టీలు, అగ్ర నేతలు కేంద్ర ప్రభుత్వ చర్యలకు, ప్రధాని మోదీ విధానాలకు మద్దతు పలికారు. దేశంలో ఉగ్రవాదం లేకుండా అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదే తరహాలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. పాక్ దుశ్చర్యకు నిరసనగా గతంలోనే పాతబస్తీ మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నమాజ్ కూడా చేశారు. ఇస్లాంలో ఇలాంటి ఘటనలకు తావులేదని పలుమార్లు స్పష్టం చేశారు. ముస్లింలతో పాటు ప్రతి ఒక్కరూ పాక్ ఆగడాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని కోరారు. అయితే.. ఇదే ఇప్పుడు ఓవైసీని ముప్పతిప్పలు పెడుతుంది.

పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ విమర్శలు చేసినందుకు ఒవైసీకి వేధింపులు తలెత్తినట్టు సమాచారం. పహల్గామ్‌ దాడి తర్వాత పాక్‌పై అసద్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే.. ఇదే అదనుగా అసద్‌ను టార్గెట్‌ చేస్తూ పాక్‌ ప్రభుత్వం, పాక్‌ సోషల్‌ మీడియా రెచ్చిపోయింది. ఒవైసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. ఒవైసీని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడింది. ఈ పరిణామంతో అసద్ పాక్ ప్రభుత్వానికి, అక్కడి సోషల్ మీడియా వ్యవస్థకి టార్గెట్ అయ్యారు.

అసదుద్దీన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వెల్లువెత్తిన చర్యలను తిప్పికొడుతూ ఒవైసీ పాక్‌కు కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు. పాకిస్థాన్‌కు భారత్‌లో అందమైన పెళ్లికొడుకును నేనే అయ్యానంటూ సోషల్ మీడియా వేదికగా ఒవైసీ తన గొంతు వినిపించారు. పాకిస్థానీయులకు ఇంతలా స్పందించే మరియు అందంగా ఉన్న వ్యక్తిని ఇంతవరకూ చూడలేదని అన్నారు. నన్ను బాగా ఫాలో అవ్వాలని, నా వ్యాఖ్యలు వినైనా మీ బుద్ధి మారాలని కోరుకుంటున్నానని పాకిస్థాన్‌ను వ్యంగంగా విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..