AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar Update: కోరుకున్నచోటే ఆధార్ సెంటర్లు! పోస్టాఫీస్ కొత్త ప్లాన్ సూపర్!

హైదరాబాద్ లోని మలక్ పేట, నాంపల్లి వాసులకు గుడ్ న్యూ్స్.. ఇకపై ఆధార్ అప్ డేట్, నమోదు వంటి సేవల కోసం ఎక్కడికి వెళ్లే పని లేదు. పోస్టాఫీస్ స్టాఫ్ మీ స్ట్రీట్ కే వచ్చి ఆధార్ సేవలు అందిస్తారు. అంతేకాదు అప్లై చేసుకున్న చోట సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మరిన్ని వివరాలు మీ కోసం..

Aadhar Update: కోరుకున్నచోటే ఆధార్ సెంటర్లు! పోస్టాఫీస్ కొత్త ప్లాన్ సూపర్!
Aadhaar Postoffice
Nikhil
|

Updated on: Sep 15, 2025 | 3:20 PM

Share

దేశవ్యాప్తంగా ఆధార్‌ అప్ డేట్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఆధార్ అప్ డేట్ కోసం బ్యాంకుల ముందు , ఆధార్ సెంటర్ల ముందు జనం క్యూలు కడుతున్నారు. అందుకే యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూడీఐఏ).. పోస్టాఫీస్ ల ద్వారా ఆధార్ సేవలు అందించాలని నిర్ణయించింది.

వీధుల్లోనే ఆధార్ సెంటర్లు

ఇకపై మీ సేవ కేంద్రాలతో పాటు పోస్టాఫీసుల్లో కూడా ఆధార్‌ సంబంధిత సేవలు పొందొచ్చు. కొత్తగా ఆధార్‌ కార్డు నమోదు చేసుకునే వాళ్లు, అడ్రెస్, ఫొటో వంటి మార్పులు చేసుకోవాలనుకునే వాళ్లు దగ్గర్లోని పోస్టాఫీసు అధికారులను సంప్రదించొచ్చు. అయితే ఆధార్ అప్ డేట్స్ సేవలను మరింత సులభతరం చేయడానికి హైదరాబాద్‌ జనరల్‌ పోస్టాఫీస్‌ ఓ కొత్త విధానాన్ని అవలంభిస్తోంది. మీ వీధుల్లోనే ఆధార్‌ సేవలందించేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మలక్‌పేట, నాంపల్లి ప్రాంతాల్లో సేవలు మొదలుపెట్టామని జీపీవో అబిడ్స్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ ప్రసాద్‌ తెలిపారు.

15 రోజుల్లో సెంటర్స్ ఏర్పాటు

పోస్టాఫీస్ సిబ్బంది లోకల్ లోని కమ్యూనిటీ లేదా కాలనీలకు వచ్చి శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒకేసారి 50 నుంచి 200 మంది ఆధార్ సేవలు పొందొచ్చు. కొత్తగా ఆధార్ నమోదు లేదా ఫొటో, పేరు, థంబ్, అడ్రస్, ఫోన్‌ నంబర్ వంటివి అప్ డేట్  చేసుకోవచ్చు. జీపీవోకి వచ్చి దరఖాస్తు చేసుకుంటే మీరు కోరుకున్న చోట 15 రోజుల్లోగా ఆధార్ సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా