ఇన్‌స్టా రీల్స్ సరదా మరొకరి ప్రాణం తీసింది. హైదరాబాద్‌లో ఓ విద్యార్థి రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. సనత్ నగర్‌లో ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఒక విద్యార్థి మృతి చెందాడు. రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు రహ్మత్ నగర్‌కు చెందిన మహ్మద్ సర్ఫరాజ్‌గా గుర్తించారు. ఇన్‌స్టా రీల్స్ కోసం మొత్తం ముగ్గురు రైల్వేట్రాక్‌పైకి వెళ్లగా.. సర్ఫరాజ్ ప్రాణాలు కోల్పోగా, మిగతా ఇద్దరూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేందుకు.. రీల్స్, వీడియోలు రికార్డ్ చేస్తుంటాడు సర్పరాజ్. ఎప్పటిలాగే సనత్ నగర్ రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తూ ఇలా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. రీల్ రికార్డ్ చేస్తూ.. రైలు రావడం గమనించలేదో.. లేక, రైలు వచ్చేసరికి పక్కకు తప్పుకోవడం ఆలస్యమైందో.. పట్టాల కింద పడి ఆ విద్యార్థి ప్రాణాలు విడిచాడు. ఇదే చివరి వీడియో అయ్యింది.
ఈమధ్యాహ్నం ముగ్గురు స్నేహితులు.. రీల్స్ మేకింగ్ కోసం సనత్ నగర్ రైల్వే ట్రాక్ మీదకు వెళ్లారు. అయితే, అనుకోని రీతిలో సర్పరాజ్‌మీదకు మృత్యువు ముంచుకొచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మహ్మద్ సర్ఫరాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. డిఫరెంట్ వీడియోలు పోస్టు చేస్తున్నట్టు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..