SCR: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు

|

Jul 13, 2022 | 8:08 PM

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అప్రమత్తమైంది. పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 నుంచి 17వరకు 34 ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లను రద్దు చేస్తూ ప్రకటన...

SCR: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు
Follow us on

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అప్రమత్తమైంది. పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 నుంచి 17వరకు 34 ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్‌- ఉందానగర్‌-సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ రైలు, సికింద్రాబాద్‌-ఉందానగర్‌ మెము, మేడ్చల్‌-ఉందానగర్‌ మెము, ఉందానగర్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌, సికింద్రాబాద్‌- ఉందానగర్‌ మెము స్పెషల్‌ రైలు, మేడ్చల్‌-సికింద్రాబాద్‌ మెము, కాకినాడ పోర్టు-విశాఖపట్నం మెము రైళ్లు రద్దు చేసిన జాబితా లో ఉన్నాయి. లింగంపల్లి – హైదరాబాద్ మార్గంలో 9, హైదరాబాద్ – లింగంపల్లి మార్గంలో 9, ఫలక్ నుమా – లింగంపల్లి మార్గంలో 7, లింగంపల్లి – ఫలక్ నుమా మార్గంలో 7, సికింద్రాబాద్ – లింగంపల్లి మార్గంలో 1, లింగపల్లి – సికింద్రాబాద్ మార్గంలో 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Trains Cancelation Schedule

ఉందానగర్- మేడ్చల్ మెము, సికింద్రాబాద్-బొల్లారం మెము, బొల్లారం-సికింద్రాబాద్ మెము, మేడ్చల్-సికింద్రాబాద్ మెము, సికింద్రాబాద్-మేడ్చల్ మెము స్పెషల్ రైళ్లు ఈనెల 14 నుంచి 17వ వరకు రద్దయ్యాయి. మరోవైపు.. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు బుధవారం అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ – నరసాపూర్, నరసాపూర్ – వికారాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..