నేరస్తులు తగ్గారు.. జైళ్లను మూసేస్తున్నాం: తెలంగాణ జైళ్ల శాఖ డీజీ

| Edited By:

May 18, 2019 | 4:38 PM

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో నేరస్తులు తగ్గుతూ వస్తున్నారని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. అందుకే రాష్ట్రంలోని మొత్తం 49 జైళ్లలో 17 జైళ్లను మూసివేస్తున్నామని ఆయన చెప్పారు. జైలుకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నేరాలను అదుపుచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక ఆ 17 జైళ్లను యాచకుల కోసం వినియోగించేలా ప్రభుత్వానికి లేఖ రాస్తామని వీకే సింగ్ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు బెగ్గర్ మాఫియా వస్తోందని.. రోడ్డుపై ఉన్న వారిని […]

నేరస్తులు తగ్గారు.. జైళ్లను మూసేస్తున్నాం: తెలంగాణ జైళ్ల శాఖ డీజీ
Follow us on

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో నేరస్తులు తగ్గుతూ వస్తున్నారని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. అందుకే రాష్ట్రంలోని మొత్తం 49 జైళ్లలో 17 జైళ్లను మూసివేస్తున్నామని ఆయన చెప్పారు. జైలుకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నేరాలను అదుపుచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక ఆ 17 జైళ్లను యాచకుల కోసం వినియోగించేలా ప్రభుత్వానికి లేఖ రాస్తామని వీకే సింగ్ చెప్పుకొచ్చారు.

ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు బెగ్గర్ మాఫియా వస్తోందని.. రోడ్డుపై ఉన్న వారిని జైళ్లకు తీసుకువస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జైళ్లో వారికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లా జైలులో ఉంగరాల మాయంపై విచారణ కొనసాగుతోందని వీకే సింగ్ తెలిపారు.