Hyderabad: ఇంటి ఓనర్లకు బిగ్ అలర్ట్.. SMS సేవల్లో అతరాయం.. వాటర్ ట్యాంకర్ ఎలా బుక్ చేసుకోవాలంటే?
నగర వాసులకు హైదరాబాద్ జలమండలి బోర్డు కీలక సూచనలు జారీ చేసింది. జలమండలి పరిధిలో ట్యాంకర్ బుకింగ్‌కు సంబంధించిన ఎస్‌ఎంఎస్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. ట్యాంకర్ బుక్ చేసుకోవాలనుకునే నగర వాసులు ఐవీఆర్‌ఎస్ (IVRS) సేవలను వినియోగించుకోవాలని కోరింది. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది. అప్పటి వరకు ప్రజలు ఈ సేవలను వినియోగించాలని కోరింది.

నగర వాసులకు హైదరాబాద్ జలమండలి బోర్డు కీలక సూచనలు జారీ చేసింది. జలమండలి పరిధిలో ట్యాంకర్ బుకింగ్‌కు సంబంధించిన ఎస్‌ఎంఎస్ సేవలు ప్రస్తుతం పనిచేయట్లేదని.. ఎస్‌డీసీ లింక్ అంతరాయం కారణంగా ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు.. వాటర్ ట్యాంకర్ కావాలి అనుకునే నగరవాసులు ట్యాంకర్ బుకింగ్‌ల కోసం ఐవీఆర్‌ఎస్ (IVRS) సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు.
సమస్య పరిష్కారానికి సాంకేతిక బృందాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయని.. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ట్యాంకర్ సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. జలమండలి వినియోగదారులు సహకరించాలని కోరుతూ, సేవలను వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాగే నీటిని వృథా చేస్తే చర్యలు
ఇదిలా ఉండగా జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించరాదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంటించినందుకు కానీ ఓ వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. అయితే జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బంజారా హిల్స్ గుండా వెళుతుండగా.. రోడ్ నం.12 లో ఓ వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో షాప్ కడుగుతూ కనిపించాడు. దీంతో అగ్రహం వ్యక్తం చేసిన ఎండీ.. తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని హెచ్చరించారు. అంతే కాకుండా అతనికి నోటీసు అందించి, జరిమానా వెయ్యాలని సంబంధిత మేనేజర్ ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి రూ.10,000 జరిమానా విధించారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
