Hyderabad: ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలాఖరు, జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో గడిపేవారు రాష్ట్రపతి. ఈ ఏడాది కూడా షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నుంచి జనవరి 3 వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల రాష్ట్రపతి శీతాకాల విడిది రద్దు అయ్యింది. ఈ విషయాన్ని వెల్లడించాయి ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వర్గాలు. ప్రతి ఏడాది సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వస్తుంటారు. ఈ క్రమంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఆయన డిసెంబర్ చివరి వారంలో రానున్నారని రాష్ట్రపతి భవన్ ఇటీవల తెలిపింది. ఆ ఉత్తర్వులు కూడా వెలువడంతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లు చేశారు తెలంగాణ అధికారులు. ఏర్పాట్లపై కంటోన్మెంట్, జీహెచ్‌ఎంసీ అధికారులతో మేడ్చల్ కలెక్టర్ హరీష్ సమీక్షా సమావేశం నిర్వహించి, పర్యవేక్షించారు.
కానీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ శీతాకాల విడిది రద్దు అయ్యినట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్ నుంచి సమాచారం అందించింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి జనవరి 3 వరకు రాష్ట్రపతి హైదరాబాద్‌లో ఉండాలి. కానీ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పెరుగుతుండటం, కొత్తగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి వస్తున్నారని, బొల్లారంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును కూడా చేపట్టింది ప్రోటోకాల్ విభాగం. ఆక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్ డ్రిల్ కూడా చేపట్టారు. కానీ అకస్మాత్తుగా పర్యటన రద్దు అవడంతో, అందరూ నిరుత్సాహపడ్డారు.
Also read:
Vangaveeti Radha: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ.. ఇంటెలిజెన్స్ డీజీకి సీఎం ఆదేశం..
Viral Video: ఎలుగుబంటి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా.. రోడ్ సేఫ్టీపై వైరల్ వీడియో..