AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త సర్వీస్

హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దష్ట్యా మరో కొత్త రైల్వే సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి – తిరుచానూరుల మధ్య కొత్త వీక్‌లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది.

హైదరాబాద్‌ నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త సర్వీస్
Hyderabad To Tirupati New Weekly Express Train
Anand T
|

Updated on: May 18, 2026 | 8:13 AM

Share

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ చర్లపల్లి – తిరుచానూరుల మధ్య కొత్త వీక్‌లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. ఈ కొత్త వీక్‌లీ టైన్‌ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం జెండా ఊపి అధికారంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చర్లపల్లి – తిరుచానూరు( 17059)

ఈ కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ ప్రతి ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 17059 నెంబర్ గల చర్లపల్లి – తిరుచానూరు వీక్‌లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.

తిరుచానూరు – చర్లపల్లి (17060) 

ఇక తిరుచానూరు తిరుపతి మధ్య రాకపోకలు సాగించే 17060 నెంబర్ గల (తిరుచానూరు – చర్లపల్లి) వీక్లీ ఎక్స్‌ప్రెస్ తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం సాయంత్రం 4:00 గంటలకు తిరుచానూరులో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8:00 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌ మల్కాజిగిరి, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రేణిగుంట మీరుదగా రాకపోకు సాగిస్తోంది.

అన్ని వర్గాల ప్రయాణికులకు, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ రైలులో మొత్తం 20 కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇందులో స్లీపర్ కోచ్‌లు, ఏసీ 3-టైర్ కోచ్‌లు , ఏసీ 2-టైర్ కోచ్‌లు, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వే షాక పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us