Hyderabad: సినీ నటిని వేధిస్తున్న ఆకతాయి ఆటకట్టించిన షీటీమ్.. ఏం జరిగిందంటే..

Crime News: మహిళలను వేధించే ఆకతాయిలు ఇప్పుడు సినిమా వాళ్లనూ వదలటం లేదు. తాజాగా.. తెలుగు సినీ పరిశ్రమలో పేరున్న నటిని టార్గెట్ చేశాడు ఓ ప్రబుద్ధుడు.

Hyderabad: సినీ నటిని వేధిస్తున్న ఆకతాయి ఆటకట్టించిన షీటీమ్.. ఏం జరిగిందంటే..
Arrest

Updated on: May 08, 2022 | 9:58 AM

Crime News: మహిళలను వేధించే ఆకతాయిలు ఇప్పుడు సినిమా వాళ్లనూ వదలటం లేదు. తాజాగా.. తెలుగు సినీ పరిశ్రమలో పేరున్న నటిని టార్గెట్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. స్టార్‌మేకర్స్‌ యాప్‌(Star Makers App) ద్వారా ఆమె ఫోన్‌ నంబరు తెలుసుకున్నాడు. అంతే..  అసభ్య పదజాలంతో వాయిస్‌ మేసేజ్‌లు చేస్తూ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. కొద్దిరోజుల తర్వాత ఫోన్‌ చేసి ఆమె ఫొటోలు తన వద్ద ఉన్నాయని.., మార్ఫింగ్‌ చేసి వాటిని నెట్టింట్లో వైరల్ చేస్తానంటూ బెదింరింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పినట్టు నడుచుకోవాలంటూ హింసించటం మెుదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన సదరు నటి.. వాట్సాప్‌ ద్వారా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన మాదాపూర్‌ షీటీమ్స్‌ సదరు యువకుడిని గుర్తించింది. ప్రబుద్ధుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించడంతో.. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

సైబరాబాద్‌ షీటీమ్స్‌ డెకాయ్‌ ఆపరేషన్స్‌ నిర్వహిస్తూ మహిళలను వేధిస్తున్న ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు. అధికశాతం బాధితులు లైంగిక వేధింపులకు గురైన వారే ఉంటున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వాట్సాప్‌, హాక్‌ ఐ, ఈ-మెయిల్‌ తదితర మాధ్యమాల ద్వారా 355 ఫిర్యాదులు అందినట్టు సైబరాబాద్‌ డీసీపీ అనసూయ వెల్లడించారు. అధికంగా వాట్సాప్‌ ద్వారా 269 ఫిర్యాదులు అందినట్లు ఆమె తెలిపారు. వీరిలో ఫోన్‌ వేధింపులు 141 ఉన్నట్టు చెప్పారు. 81 కేసుల్లో 18 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. 119 మందిని పద్ధతి మార్చుకోమంటూ హెచ్చరించారు. 319 మంది ఆకతాయిలకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇందులో మైనర్లు 98, 19-24 వయస్కులు 112, 25-35 ఏళ్ల వారు 92, 36-50 మధ్య 17 మంది ఉన్నారు. రెండు నెలల్లో 1003 డెకాయి ఆపరేషన్స్ నిర్వహించారు. ఏడు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. బాధితులు వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు 94906 17444 వాట్సాప్‌ నంబర్‌ వినియోగించాలని వారు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి..

ఇవి కూడా చదవండి

AP Crime News: పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా విద్యార్థిపై కత్తులతో దాడి.. పోలీసుల విచారణలో సంచలనాలు

Viral News: Swiggy డెలివరీ బాయ్ బద్ధకంతో ఏం చేశాడో తెలుసా.. విషయం తెలిస్తే షాక్ అవుతారు..