Hyderabad Rains: భాగ్యనగర వాసులను పకరించిన వరుణుడు.. చల్లబడిన నగరం.. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం

|

Mar 20, 2022 | 5:01 PM

Hyderabad Rains: హైదరాబాద్ లో భిన్న వాతావరణం ఉంది. పగలు ఎండలు మడిస్తుంటే.. సాయంత్రం అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం తేలికపాటి..

Hyderabad Rains: భాగ్యనగర వాసులను పకరించిన వరుణుడు.. చల్లబడిన నగరం.. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం
Rains In Hyderabad
Follow us on

Hyderabad Rains: హైదరాబాద్ లో భిన్న వాతావరణం ఉంది. పగలు ఎండలు మడిస్తుంటే.. సాయంత్రం అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. దీంతో తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు కొంచెం ఉపశమనం లభించింది. మార్చి నెల నుంచి భానుడు(Summer Heat) భగభగ మండిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా భాగ్యనగరంలో తీవ్ర ఎండలు మండుతున్నాయి. ఈ క్రమం లో నిన్నటి నుంచి నగరంలో వాతావరణం కొంచెం చల్లబడింది.  అయితే ఆదివారం ఉదయం కొంచెం ఎండ తీవ్రత ఉన్నా.. సాయంత్రానికి పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

అమీర్ పెట్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, సహా నగరంలో అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే సోమవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

 

Also Read: Ram Gopal Varma: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన వర్మ .. భాగ్యనగరంలో మొక్కలు నాటిన ఆర్జీవీ

RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ఫంక్షన్‌లో జనసేన జెండాల సందడి.. నెట్టింట వీడియో వైరల్

Nalgonda Temperature: నల్గొండలో నిప్పుల కుంపటి.. దేశంలోనే టాప్ ప్లేస్.. పూర్తి వివరాలివే