Telangana: కళ్లు చెదిరే ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ.. అవును.. వాహనదారులకు గుడ్‌న్యూస్‌ వినిపించింది తెలంగాణ పోలీస్‌ శాఖ. తలనొప్పిగా మారిన చలాన్ల క్లియర్‌కు భారీ ఆఫర్‌ ప్రకటించింది.

Telangana: కళ్లు చెదిరే ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్
Traffic Challans

Updated on: Feb 23, 2022 | 8:00 PM

Traffic Challans: ట్రాఫిక్‌ చలాన్లతో రోడ్డు మీదికి వెళ్లాలంటేనే వణికిపోతున్న వాహనదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు తెలంగాణ పోలీసులు (Telangana police). పెండింగ్‌ చలాన్లను రాబట్టేందుకు భారీ ఆఫర్లు ప్రకటించారు. ప్రత్యేకించి టూవీలర్లపైన భారీ డిస్కౌంట్‌ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ద్విచక్రవాహనదారులకు 75శాతం డిస్కౌంట్‌ కల్పించారు. కార్లకు 50శాతం, ఆర్టీసీబస్సులకు 30శాతం, తోపుడు బండ్లకు 20శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పెండింగ్‌ చలాన్లను ఆన్‌లైన్‌, మీ సేవా సెంటర్లలో చెల్లించవచ్చని తెలిపారు. మార్చి1 నుంచి 30 వరకు నెలరోజులపాటు చలాన్ల క్రియరెన్స్‌ కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్, రాచకొండ పరిధిలో 600 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్‌ చలాన్లు పేరుకుపోయినట్లు చెబుతున్నారు ఉన్నతాధికారులు. పెండింగ్ చ‌లాన్లు క్లియర్ చేసేందుకే ఈ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చామని చెబుతున్నారు. ఈ ప్రతిపాదన వర్కవుట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని.. పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. పెండింగ్‌ చలాన్ల విషయంలో ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై హర్షం ప్రకటిస్తున్నారు వాహనదారులు. ఇది కచ్చితంగా గొప్ప ఆఫర్‌ అంటున్నారు.

Also Read:  అన్నం పాత్రలో ఉడికించితే మంచిదా..? ప్రెజర్ కుక్కర్‌లో వండితే మంచిదా?

Cloves: లవంగాలతో దిమ్మతిరిగే ప్రయోజనాలు .. కనీసం మీ ఊహకు కూడా అందవు