Hyderabad Police: డ్రంక్ అండ్ డ్రైవ్‌ని రాష్ట్ర పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపడం ద్వారా అనేక మంది ప్రమాదాల బారినపడటంతో పాటు.. మందుబాబుల కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు చెక్ పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మందుబాబులను మార్చేందుకు వినూత్ర కార్యక్రమాలు చేపడుతున్నారు పోలీసులు. తాజాగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు పోలీసు అధికారులు. డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడి శిక్ష ఖరారైన వారికి డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు. నేరాలు చేసిన వారికి తెలుపు రంగులోని దుస్తులు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ మందుబాబులకు మాత్రం ప్రత్యేక డ్రెస్ కోడ్ తీసుకువచ్చారు. నేరాలు చేసిన వారికంటే.. మద్యం తాగి వాహనాలు నడిపేవారే అత్యంత ప్రమాదకరం అని భావన కలిగేలా ఎరుపు రంగు దుస్తులను వారికి అందిస్తున్నారు.
ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే.. వారికి కోర్టు జైలు శిక్ష విధిస్తే.. వారి పేర్లను ఇకపై శిక్ష పడిన ఖైదీలుగా రికార్డులకు ఎక్కించనున్నారు. వాస్తవానికి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన చాలా మంది ఒకటి రెండు రోజుల జైలు శిక్షే కదా? ఇలా వెళ్లి అలా వచ్చేస్తామని భావిస్తుంటారు. అలాంటి భావనకు చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది పోలీసు శాఖ. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి కోర్టు శిక్ష ఖరారు అయితే.. వారిని శిక్ష పడిన ఖైదీలుగా రికార్డ్ చేసుకుంటున్నారు జైలు అధికారులు. దాంతోపాటు.. డేంజర్ గుర్తుగా భావించే ఎరుపు రంగు దుస్తులను అందిస్తున్నారు. జైలులో ఉన్నన్ని రోజులు వారు ఈ డ్రెస్ కోడ్ పాటించాల్సిందే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన కొంతమందిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వీరికి కోర్టు 20 రోజుల జైలు శిక్ష విధించగా.. వారందరినీ చర్లపల్లి జైలుకు తరలించి, ఎరుపురంగు దుస్తులు అందించారు.
Also read:
Cyber Crime: ఇంతకంటే దారుణం మరోటుండదు.. తల్లి కోసం దాచిన డబ్బు.. ఒక్క ఫోన్ కాల్‌తో..