Hyderabad CP: అడ్డూ అదుపు లేకుండా.. ధనార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా నడుపుతున్న పబ్బుల యాజమాన్యాలపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కన్నెర్ర చేశారు. పబ్బుల యాజమాన్యాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంగిస్తే ఊరికునేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్లకు లిక్కర్ అమ్మితే బార్లు, పబ్‌లపై చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన సీపీ అంజనీ కుమార్.. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.
నూతన సంవత్సర వేడులకపై ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనల మేరకు ముందుకు పోతామన్నారు. ఆంక్షలు పాటిస్తూ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రజలకు సీపీ అంజనీ కుమార్ సూచించారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని సీపీ స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ప్రశాంత వాతావరణంలో న్యూఇయర్ వేడుకలను నిర్వహించుకోవాలన్నారు. వేడుకల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు.
Also read:
Hyderabad: వచ్చే వారం గ్రేటర్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం.. పూర్తి వివరాలు
Minister Anil Kumar Yadav: నాని, పవన్ కళ్యాణ్ పై మంత్రి అనిల్‌కుమార్ పవర్‌ఫుల్ పంచ్‌లు లైవ్ వీడియో
ఇలా అయితే మా వల్ల కాదు.. ఏకంగా థియేటర్ మూసివేసిన యజమాని.. అసలు విషయం ఏంటంటే..