Hyderabad: అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఎల్బీనగర్ అండర్ పాస్ (RHS), బైరమల్ గూడ (LHS) ఫ్లైఓవర్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రూ.9.28 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎల్బీనగర్ అండర్ పాస్, రూ.28.642 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరమల్ గూడ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు ప్రారంభించనున్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్మించింది. ప్రజా రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా, రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ సిగ్నల్ ఫ్రీ నగరంగా ఏర్పాటు చేయుటకు ఎస్.ఆర్.డి.పి పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా నగరం నలువైపులా ఫ్లై ఓవర్లు, స్కై వేలు, మేజర్ కారిడార్లు, గ్రేడ్ సఫరేటర్లు, అండర్ పాస్ నిర్మాణాలు చేపడుతోంది ప్రభుత్వం.
అందులో భాగంగా నగరంలోనే ప్రధాన కూడలి అయిన, రద్దీ ప్రాంతమైన ఎల్‌బి నగర్ కూడలిలో అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను చేపట్టారు. వరంగల్, నల్గొండ ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణకు, నివారణకు అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మాణాలను చేపట్టారు. ఎల్‌బి నగర్ కూడలి (RHS) ఎడమవైపు రూ. 40 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు గల అండర్ పాస్, 12.875 మీటర్ల వెడల్పుతో 72.50 మీటర్ల బాక్స్ పోర్షన్ 3 లేన్ ల యుని డైరెక్షన్‌లో ఈ అండర్ పాస్ నిర్మాణం చేపట్టారు.
ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆరంఘర్, మిధాని మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను నివారించేందుకు రూ. సుమారు 29 కోట్ల వ్యయంతో బైరమల్ గూడ (LHS) ఫ్లైఓవర్ 780 మీటర్ పొడవు, 400 మీటర్లు డక్ పోర్షన్, 380 ఆర్‌ఈ వాల్, 12.50 మీటర్ల వెడల్పుతో మూడు లేన్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టినట్లయ్యింది.
Also read:
Password Alert: పాస్ వర్డ్ విషయంలో మీరు ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు