AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూబ్లీహిల్స్‌ రిచ్‌కిడ్స్ కేసులో బిగ్ అప్‌డేట్.. మీనాకుమారికి కస్టడీలో వెలుగోకి కీలక విషయాలు!

సాధారణంగా పిల్లలకు మంచి మాటలు చెప్పే తల్లులను చూసి ఉంటారు, అలాగే పిల్లలు చెడు దారిలో వెళ్తే వారిని సరిదిద్దే తల్లిదండ్రులను చూసి ఉంటారు. కానీ ఇక్కడో తల్లి మాత్రం తానే పక్కనుండి పిల్లలతో నేరాలు చేయించడం మొదలుపెట్టింది. తమ పిల్లల సహాయంతో బాగా డబ్బున్న వారి పిల్లలను లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేసేది. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెతో పాటు తన ఇద్దరు కుమారులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

జూబ్లీహిల్స్‌ రిచ్‌కిడ్స్ కేసులో బిగ్ అప్‌డేట్.. మీనాకుమారికి కస్టడీలో వెలుగోకి కీలక విషయాలు!
Jubilee Hills Rich Kids Case
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Aug 22, 2026 | 1:53 PM

Share

జూబ్లీహిల్స్‌లో బాగా డబ్బున్న వ్యక్తుల పిల్లలే లక్ష్యంగా తమ కొడుకులను రంగంలోకి దించి, వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసుకొని వాటితో బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన మీనాకుమారిని రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం ఆమెను ప్రశ్నించిన విమెన్ సేఫ్టీ పోలీసులు.. విచారణలో మైనర్లను ట్రాప్ చేసిన విధానం, బ్లాక్‌మెయిల్ వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో మీనాకుమారిని ఈరోజు సాయంత్రం కోర్టులో హాజరుపరచనున్నారు.

సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసి సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్లను బుట్టలో వేసుకున్నట్లు మీనాకుమారి కుమారులు ఆజాద్, రాజీవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. మైనర్లతో సన్నిహితంగా ఉన్న సమయంలో వారికి తెలియకుండానే ఆజాద్ రహస్యంగా వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలను తన తల్లి మీనాకుమారికి పంపినట్లు దర్యాప్తులో తేలింది.

ఆజాద్ నుంచి అందిన వీడియోలను ఉపయోగించి మీనాకుమారి మైనర్లను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఆజాద్, రాజీవ్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మీనాకుమారిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కస్టడీలో భాగంగా ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విమెన్ సేఫ్టీ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మైనర్లను ఎలా ట్రాప్ చేశారు? ఎవరెవరిని సంప్రదించారు? బ్లాక్‌మెయిల్ ద్వారా ఎంత మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల