మురుగునీటి శుద్ధిపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మరో భారీ సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

|

Aug 06, 2021 | 1:33 PM

హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధిపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఫతేనగర్‌లో 100 MLD సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు.

మురుగునీటి శుద్ధిపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మరో భారీ సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
Minister Kt
Follow us on

Minister KTR foundation stone for Sewerage Treatment Plant: హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధిపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఫతేనగర్‌లో 100 MLD సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. 11 ఎకరాల్లో రూ.317 కోట్ల వ్యయంతో 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో చేపట్టనున్న మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌కు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం కూకట్ పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఫతేనగర్‌లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. ఫతేనగర్‌లో 11 ఎకరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. రోజుకు 100 ఎంఎల్‌డీల మురుగు నీరు శుద్ధి అయ్యే అవకాశముందన్నారు.

రాష్ట్రంలో పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏటా హైదరాబాద్‌కు లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్నారని.. వారి అవసరాలకు తగిన విధంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ నగరం ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు కేవలం 160 చ.కి.మీ పరిధి మాత్రమే ఉండేదని.. చుట్టుపక్కల ఉన్న అన్ని మున్సిపాలిటీలతో కలిపి జీహెచ్‌ఎంసీగా ఏర్పాటు చేస్తే దాని వైశాల్యం 625 చ.కి.మీ.కు పెరిగిందన్నారు. నగర వ్యాప్తంగా రోజుకు 1,950 ఎంఎల్‌డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతుంటే దానిలో 772 ఎంఎల్‌డీలను జలమండలి ద్వారా శుద్ధీకరణ చేస్తున్నామన్నారు. ఫతేనగర్‌లో రూ.1280 కోట్ల వ్యయంతో 17 ఎస్‌టీపీలు నిర్మించబోతున్నట్లు మంత్రి చెప్పారు.

సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో ఎస్టీపీ నిర్మాణం జరగనున్నట్లు హైదరాబాద్ వాటర్ వర్క్స్ అధికారులు తెలిపారు. బాలానగర్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సురారం, జగద్గిరిగుట్ట నుంచి వచ్చే మురుగు నీటిని ఫతేనగర్ ఎస్టీపీలో శుద్ది చేయనున్నారు. ఈ శుద్ది చేసిన నీటీని కూకట్‌పల్లి నాలా ద్వారా హుస్సేన్ సాగర్‌లోకి విడుదల చేస్తారు. అంతేకాకుండా హుస్సేన్‌సాగర్ క్యాచ్మెంట్ పరిధిలో కొత్తగా 376.5 ఎంఎల్‌డీ సామర్థ్యం గల 17 ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం జలమండలి పరిధిలో 25 ఎస్టీపీలతో 772 ఎంఎల్‌డీల మురుగునీటి శుద్ధి జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వాటర్ బోర్డ్ ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


Read Also…. Khel Ratna Award: రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరు మార్పు.. ఇకపై మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డు

Andhra Pradesh: మహిళపై ఆటో డ్రైవర్ దాష్టికం.. ఇచ్చిన బాకీ అడిగినందుకు దారుణానికి ఒడిగట్టారు..