హైదరాబాద్‌లోని మెట్రో ప్రయాణికులకు అధికారులు షాకిచ్చారు. ఇకనుంచి మెట్రో స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లు వినియోగించుకోవాలనుకుంటే ఛార్జీలు చెల్లించాల్సిందేనని నిర్ణయించారు. గతకొంతకాలంగా మెట్రో నష్టాలను తగ్గించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల రద్దీ ఎక్కవగా ఉండే సమయాల్లో రాయితీని కూడా ఎత్తివేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి దీన్ని అమలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా పబ్లిక్ టాయిలెట్లపై మరో నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో మరుగుదొడ్డికి రూ.5, మూత్ర విసర్జనకు రూ.2 వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
అయితే కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించినందుకు ఇప్పటిదాకా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు. రాయితీ కోతలు, అధిక ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్న మెట్రో ప్రయాణికులకు తాజాగా తీసుకున్న నిర్ణయం మరింత భారం కానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..