గడిచిన వారం రోజులుగా తెలంగాణలో ఎండలు ఓ రేంజ్‌లో దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటలకే మధ్యానాన్ని తలపించేలా సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే మండుటెండలతో మాడిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూల్ న్యూస్ చెప్పింది.
అంతే కాకుండా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కరుస్తాయన్ని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39°C నుండి 41°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో గడిచిన వారం రోజులుగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..