వేసవిలో వర్షాకాలాన్ని తలపిస్తూ.. అకాల వర్షాలు కురుస్తున్నాయి. చినుకు పడితే నగరరోడ్లు చిత్తడిగా మారిపోతున్నాయి. మండు వేసవిలోనూ అకాల వర్షాలతో భాగ్యనగర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చిన్న వానకే రోడ్లు నదులను తలపిస్తున్నాయి. అటు వాహనదారులు, ఇటు పాదచారులూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మాత్రం ఈ రోడ్లను, నాలాలను బాగుచేయడంలేదు. నగర ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. దాంతో ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగాడు.
జల్ పల్లి మున్సిపాలిటీలోని నబీల్ కాలనీ లో నిప్రధాన రహదారిలో…వర్షపు నీరు నిలిచి రోడ్డు నదిని తలపిస్తోంది. నీళ్లు నిలువ ఉండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులు అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారని… ఓ యువకుడు ఆ నీటిలో స్నానం చేస్తూ డాన్స్ చేస్తూ వినూత్న నిరసనకు దిగాడు. నీటిలో వాహనాలు ముందుకు కదలక ఇబ్బంది పడుతున్న వాహనదారులకు సహాయం చేస్తూ ఆ మురుగునీటిలో స్నానం చేస్తూ తమ సమస్యను అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అధికారుల దృష్టికి చేరుతుందా, ఎలాంటి చర్యలు చేపడతారు అనేది వేచి చూడాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..