Hyderabad News: ఏటీఎం వినియోగదారుల దృష్టి మళ్ళించి ఒరిజినల్ ఏటీఎం కార్డులను(ATM Cards) కాజేసి నఖిలీ ఏటీఎం కార్డును ముట్టజెప్పి ఆపై ఒరిజినల్ ఏటీఎం కార్డుతో డబ్బులు కాజేస్తున్న ముఠా సభ్యులను సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) మైలార్ దేవ్ పల్లి పొలీసులు(Mailardevpally Police Station) అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మైలార్ దేవ్ పల్లి సిఐ నర్సింహ వివరించారు. అజయ్ సాహు, నితిన్ కుమార్ సాహు ఇద్దరూ ఏటిఎంల వద్ద నిలబడి వినియోగదారులు ఏటీఎం లో డబ్బులు డ్రా చేస్తుండగా గమనిస్తారు. వారికి సహాయం చేస్తున్నట్లు నటించి.. వారి పిన్ నెంబర్ తెలుసుకుంటారు. ఆ తరువాత వారి ఒరిజినల్ ఏటీఎం కార్డు కాజేసి.. దాని స్థానంలో నఖిలీ ఏటీఎం కార్డును బాధితులకు ముట్టజెప్తారు. వారు వెళ్లిపోగానే.. ఒరిజినల్ ఏటీఎం కార్డులతో ఉన్న డబ్బులన్నీ ఊడ్చేస్తారు.
దీనిపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితులను కనిపెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. నిందితుల గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. మైలార్ దేవ్ పల్లి పొలిస్టేషన్ పరిధిలో అజయ్, నితిన్ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నింధితుల గురువు శంకర్ పవార్ అలియాస్ భయ్యు వీరికి ఇలాంటి నేరపూరితమైన పనులను నేర్పించి హైదరాబాద్ పంపినట్లు సిఐ నర్సింహ వెల్లడించారు. మైలార్ దేవ్ పల్లి పొలిస్టేషన్ పరిధిలో నాలుగు చోట్ల ఏటీఎం సెంటర్ల వద్ద లక్షా 60 వేల రూపాయలు దొంగలించినట్లు వివరించారు. ఇద్దరు నింధితుల వద్ద నఖిలీ ఏటిఎం కార్డులను, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read:
UP Election 2022: మీ వెంట మేమున్నాం.. ముస్లిం మహిళల పోరాటంపై ప్రధాని మోడీ ప్రశంసలు..