Hyderabad : ఆర్మీ క్యాంపు పరిసరాల్లో ఆగి ఉన్న కారు.. ఏంటా అని డోర్ ఓపెన్ చేసి చూస్తే..!

|

Nov 30, 2021 | 6:50 AM

Hyderabad : హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లోని ఆర్మీకి సంబంధించిన బహిరంగ ప్రదేశంలో వ్యక్తి మృతి తీవ్ర కలకలం రేపింది. ఆగి ఉన్న కారులో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు.

Hyderabad : ఆర్మీ క్యాంపు పరిసరాల్లో ఆగి ఉన్న కారు.. ఏంటా అని డోర్ ఓపెన్ చేసి చూస్తే..!
Murder
Follow us on

Hyderabad : హైదరాబాద్‌లోని ఆల్వాల్‌లోని ఆర్మీకి సంబంధించిన బహిరంగ ప్రదేశంలో వ్యక్తి మృతి తీవ్ర కలకలం రేపింది. ఆగి ఉన్న కారులో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్ పెద్ద కమేళాలో ఆర్మీకి సంబంధించిన కారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి ఆల్వాల్ ప్రాంతానికి చెందిన విజయ భాస్కర్ రెడ్డిగా గుర్తించారు. విజయ భాస్కర్ నోరు, ముక్కు వద్ద గాయాలు కావడం, చెవి వెనుక భాగం నుండి రక్తస్రావం జరుగుతుండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో మరణించిన వ్యక్తి వద్ద నుంచి ఆధారాలు సేకరించారు పోలీసులు. విజయ భాస్కర్ కు ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. ఆ నేపథ్యంలో అతను చనిపోవడానికి ఆస్తి తగాదాలే కారణమా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయ భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Also read:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధర.. 10 గ్రాములపై ఎంత తగ్గిందంటే..

Twitter Gets New CEO – Parag Agrawal: భార‌తీయుడికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు..

Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..