Viral Video: రోడ్డు మధ్యలో డ్యాన్స్.. వీడియో షేర్ చేసిన పోలీసులు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

| Edited By: Ravi Kiran

Aug 10, 2021 | 7:50 AM

Viral Video: రద్దీగా ఉండే రోడ్డును దాటాలంటేను ఆచితూచి అడుగులు వేస్తాం. అలాంటిది రోడ్డు మధ్యలో సరదాగా నిల్చుని, డ్యాన్స్ వేస్తే.. పరిస్థితి ఏంటి.

Viral Video: రోడ్డు మధ్యలో డ్యాన్స్.. వీడియో షేర్ చేసిన పోలీసులు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
On Road
Follow us on

Viral Video: రద్దీగా ఉండే రోడ్డును దాటాలంటేను ఆచితూచి అడుగులు వేస్తాం. అలాంటిది రోడ్డు మధ్యలో సరదాగా నిల్చుని, డ్యాన్స్ వేస్తే.. పరిస్థితి ఏంటి. ఇక్కడో వ్యక్తి ఏమాత్రం భయం, బెరుకు లేకుండా.. వాహనాలు వస్తుంటే అటూ ఇటూ తిరుగాడాడు. అంతటితో ఆగకుండా.. నడి రోడ్డుపైకి వచ్చి.. చిందులు వేశాడు. అయితే, అతని కంత్రీ చేష్టలన్నీ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అవగా.. ఆ వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా డ్యాన్స్ చేసి ప్రాణాలు పోగొట్టుకోకండి అంటూ జనాలకు చురకలంటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, ఈ ఘటన అంతా ఎక్కడో కాదు.. మన భాగ్యనగరంలోనే చోటు చేసుకుంది. మాదాపూర్‌లోని దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్‌పై వాహనాలు వస్తుండగా.. ఓ వ్యక్తి హడావిడిగా, ప్రమాదకరంగా రోడ్డు దాటాడు. కాసేపు రోడ్డుకు అవతలివైపు నిల్చున్న ఆ వ్యక్తి.. వాహనాల రద్దీ తగ్గగానే రోడ్డు మధ్యలోకి వచ్చాడు. ఇక ఆగితేనా.. కల్లు తాగిన కోతిలా చిందులు వేయబట్టాడు. కాసేపు రోడ్డుపై డ్యాన్స్ చేసిన ఆ వ్యక్తి.. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే కేబుల్ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో అతని ప్రవర్తన అంతా రికార్డ్ అయ్యింది. అది చూసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేశారు. దీనికి కౌంటర్ ఇస్తూ.. ‘‘సరదా కోసం ప్రాణాలకు తెగించి రోడ్డుపై విన్యాసాలు, డ్యాన్స్‌లు చేయకండి.’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. రోడ్డు భద్రత గురించి ప్రజలకు మరొక్కసారి హితవుచెప్పారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

కాగా, ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్‌గా రెస్పాండ్ అయితే.. మరికొందరు నెగటీవ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. ఇలా వీడియోలు షేర్ చేయడం వల్ల జనాల్లో మార్పు రాదని, చిల్లర వేషాలు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

YSR Nethanna Nestham: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రేపే లబ్ధిదారుల అకౌంట్‌లో రూ.24 వేలు..

Covid 19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం కీలక మార్గదర్శకాలు.. ఇకపై విదేశీ జాతీయులకు టీకాలు

Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..