ఇంట్లో దొంగలు పడ్డారంటే సాధారణంగానే డబ్బులో, నగదలో, ఇతర విలువైన వస్తువులేవో ఎత్తుకుపోతారు. కానీ, ఈ ఇంట్లో పడ్డ దొంగ.. అవేవీ కాకుండా.. ఓ పిల్లిని ఎత్తుకెళ్లాడు. అవును, అందంగా ఉందని ముచ్చటపడ్డాడో ఏమో గానీ.. కనిపించగానే లటుక్కున సంకలో పెట్టుకునో తుర్రుమని జారుకున్నాడు. ఈ ఘటన మన హైదరాబాద్‌లోనే చోటు చేసుకోగా.. తన పిల్లిని ఎవరో ఎత్తుకెళ్లారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంలో వెలుగులోకి వచ్చింది. ఈ పిల్లి చోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జహంగీర్ నగర్ కు చెందిన గజాన్ మహమూద్ అనే యువకుడు తన పెంపుడు పిల్లి పోయిందంటూ ఫిర్యాదు చేశాడు. ఒడ్ ఐ క్యాట్ బ్రీడ్ కి చెందిన పిల్లిని థాయిలాండ్ నుండి రూ. 35 వేలు పెట్టి కొన్నాడు. దీనిని ఏడు నెలల క్రితం తన సమీప బంధువుల వద్ద కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ పిల్లి విలువ సుమారు రూ.50 వేలు పైనే ఉంది. అయితే, సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక వ్యక్తి స్కూటీపై వచ్చి తన పెళ్లిని ఎత్తుకెళ్లాడని, దీనికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో నమోదయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసాడు యువకుడు గజాన్. తన పెల్లిని తనకు సురక్షితంగా అప్పగించాలని పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చోరీకి గురైన పిల్లి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..