AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. ట్రాఫిక్ రద్దీయే ఉండదు.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్..

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. నగరంలో ముఖ్యమైన ప్రదేశం ఉన్న కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ రద్దీకి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్లాన్ రూపొందించింది. పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ముందడుగు వేసింది. రెండేళ్లల్లో పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంది.

Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. ట్రాఫిక్ రద్దీయే ఉండదు.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్..
Flyover
Venkatrao Lella
|

Updated on: Aug 12, 2026 | 1:28 PM

Share

హైదరాబాద్ ప్రజలకు మరో సూపర్ న్యూస్. నగరంలో ప్రముఖ పార్క్‌గా ప్రసిద్ది పొందిన కేబీఆర్ పార్క్ వద్ద రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఈ పార్క్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణానికి ముందడుగు వేసింది. మొత్తం 14 నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఏడు ప్రధాన కూడళ్ల వద్ద ఈ నిర్మాణాలు జరగనున్నాయి. మొన్నటివరకు కోర్టు కేసులు, భూసేకరణ ప్రక్రియ వల్ల కొంత జాప్యం జరగగా.. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. దీంతో అధికారులు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. రెండేళ్లల్లో పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పనులు త్వరతగతిన పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు

ఈ ప్రాజెక్టులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 నుంచి కేబీఆర్ పార్క్ రోడ్డు మధ్య నాలుగు లైన్ల ఫ్లైఓవర్ ఉంటుంది. ఇక పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపుకు 3 లైన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఇక మహారాజా అగ్రసేన జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 వైపు 2 లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇక ఫిల్మ్ నగర్-బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 మధ్య 2 లైన్లతో కూడిన ఫ్లైఓవర్ ప్రతిపాదించారు. అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్-జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మధ్య 2 లైన్ల ఫ్లైఓవర్ ఉంటుంది. ఇక వీటితో పాటు మొత్తం 6 అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు 2 లైన్ల అండర్ పాస్, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి ఫిల్మ్ నగర్ వైపు ఒక అండర్ పాస్, ఎల్వీ ప్రసాద్ నుంచి పంజాగుట్ట వైపు 3 లైన్ల అండర్ పాస్, రోడ్డు నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వరకు ఒక అండర్ పాస్ ఉంటుంది.

రూ.1090 కోట్ల అంచనా వ్యయం

దాదాపు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.1090 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. వీటిల్లో నిర్మాణ పనుల కోసం రూ.699.75 కోట్లు ఖర్చు కానుండగా.. భూసేకరణ ప్రక్రియ కోసం రూ.390 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఉక్కు వంతెనల నిర్మాణం వల్ల భూసేకరణ ఖర్చు తగగ్గుతుందని, తక్కువ స్థలంలోనే పనులు చేపట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కేబీఆర్ పార్క్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది. సిగ్నల్ ఫ్రీ జర్నీ వాహనదారులకు లభించనుంది. హైటెక్ సిటీ, ఫిల్మ్ నగర్ వెైపు వెళ్లేవారు వేగవంతంగా చేసుకోవచ్చు.

Follow Us