Hyderabad: కేరళ స్టోరీని తలదన్నేలా ది హైదరాబాద్‌ స్టోరీ.. బయో వార్‌కు ప్లాన్.. 17మంది అరెస్ట్..

|

May 12, 2023 | 6:24 AM

ఐదేళ్లుగా హైదరాబాద్‌ అడ్డాగా పన్నిన కుట్రలు ఒక్కొక్కొటిగా బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్‌ నుంచి ATS టీమ్స్‌ వచ్చి అరెస్టులు చేసే వరకు మ్యాటర్‌ పొక్కలేదు. కానీ మధ్యప్రదేశ్‌- తెలంగాణ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌తో గుట్టురట్టయింది. కేరళ స్టోరీని తలదన్నేలా ది హైదరాబాద్‌ స్టోరీ ప్రకంపనలు రేపుతోందిప్పుడు. దక్కన్‌ కాలేజీ ప్రొఫెసర్‌ సలీం టెర్రర్‌ లింకుల వెనుక ఎవరెవరి ఇన్‌వాల్వ్‌మెంట్‌ వుంది? ఈ పాయింట్‌ ఇప్పుడు చర్చగా-రచ్చగా మారింది.?

Hyderabad: కేరళ స్టోరీని తలదన్నేలా ది హైదరాబాద్‌ స్టోరీ.. బయో వార్‌కు ప్లాన్.. 17మంది అరెస్ట్..
Conversion Racket
Follow us on

మత మార్పిడి నుంచి ఉగ్రవాదం వరకు.. ప్రొఫెసర్ నుంచి కూలి వరకు అన్నిట్లో వాళ్లే.. అన్నింటా వీళ్ళే.. ఎవరికి ఎలాంటి అనుమానం రాదు….!! ఉంటున్న ఇంటి పక్కవారికి కూడా వీరి వివరాలు తెలీదు. ఇదీ హైదరాబాద్‌లో పట్టుబడిన వారి పంథా. ఇంత పగడ్బందిగా ప్లాన్ చేసుకొని ఐదు సంవత్సరాల నుండి హైదరాబాదులో రహస్య సమావేశాలు .., రహస్య శిక్షణలు నిర్వహిస్తూ జన జీవన స్రవంతిలో తిరిగేసారు అనుమానిత ఉగ్రవాదులు. పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి వారిని తీసుకెళ్తే గానీ వీరి ఉగ్ర రూపం బయట పడలేదు… అసలు హైదరాబాద్ కేంద్రంగా ఎం జరుగుతుంది. ఎక్కడో భూపాల్ లో నివసించే వాళ్ళు హైదరాబాద్ కు ఎందుకు వచ్చారు?? వారి టార్గెట్ ఎంటి ?? ప్రణాళిక ఎంటి ?? ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్న సందేహాలు..

హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూపాల్, హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఇస్లామిక్ రాడికల్ రాకెట్ ను బట్టబయలు చేశారు మధ్యప్రదేశ్ ఏటిఎస్ పోలీసులు. ఈ కేసులో మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. 11 మంది భూపాల్ కి సంబంధించిన నిందితులు కాగా.. ఆరుగురిది హైదరాబాద్. ఈ టెర్రర్ రాకెట్‌లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి యాసిర్.

భూపాల్ కేంద్రంగా ఒక జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్న యాసిర్.. నిషేధిత ఉగ్రవాద సంస్థతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఏ విధ్వంసం అయినా వ్యక్తితో సాధ్యం కాదు కాబట్టి ఒక టీంని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా భూపాల్‌కి చెందిన వివిధ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులను టార్గెట్ చేసి వారిని ఇస్లాం వైపు ఆకర్షితులను చేశాడు. అలా ఆకర్షితుడైన వాడే మహమ్మద్ సలీం అలియాస్ సౌరబ్ రాజ్ వైద్య

ఇవి కూడా చదవండి

2009 వరకు హిందువుగా ఉన్న సౌరబ్ రాజ్ వైద్య ఉన్నఫలంగా ఇస్లాం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత భార్య మాన్సీని కూడా నెమ్మదిగా ఇస్లాం వైపు ఆకర్షితురాలను చేసి మతం మార్పించేశాడు. మాన్సి అగర్వాల్ కాస్త రహీల సలీంగా మారిపోయింది.. భూపాల్ లో ఇక్కడ వీరికి ఉద్యోగం రాకపోవడంతో ఒక ఇస్లామిక్ స్కూల్లో పనిచేశాడు మహమ్మద్ సలీం. అక్కడ యాసిర్‌తో సలీంకు పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ కు హెచ్ ఓ డీ గా ఎదిగాడు సలీం.

ప్రొఫెసర్‌గా చలామణి అవుతూ సలీం.. తమ సామ్రాజ్యాన్ని విస్తరించేలా చాప కింద నీరులా విస్తరించాడు. మహమ్మద్ సల్మాన్, జునైద్, హమీద్ , అబ్బాస్ అలీ వీళ్ళందరూ సలీం నిర్వహించిన సమావేశాలకు వచ్చినవారే.. వీళ్ళందరికీ అనువైన ప్రాంతమైన టోలిచౌకిలో మొదట్లో రహస్య సమావేశాలు నిర్వహించుకునేవారు. స్థానికులకు వీరిపై అనుమానం రావడంతో.. టోలిచౌకి నుంచి అటవీ ప్రాంతనికి మార్చారు. అక్కడే పలుసార్లు రహస్య సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.

మొదట ఎక్కువ మందిని మతం మార్చడమే వీరి ప్రధాన టాస్క్. అలా మతం మారిన వారందరికీ స్పెషల్ క్లాస్‌లు తీసుకుని పూర్తిగా ఇస్లాంపై నమ్మకం కలిగేలా.. ఇస్లాం కోసం ఏమైనా చేయగలిగేలా తయారు చేస్తారు. ఇక మూడో ఫేస్ కెమికల్స్, బయోలాజికల్, బ్యాక్టీరియల్ దాడులు చేయడంలో శిక్షణ ఇస్తారు. వీటికి సంబంధించిన ఆన్లైన్ సపోర్ట్ అంతా భూపాల్ నుండే వస్తుంది. వీటికి సంబంధించిన లీడ్ అంతా భూపాల్ నుంచి యాశిర్ హైదరాబాద్ నుండి సలీం చూసుకునే వారు. యువతను ఇస్లాం వైపు ఆకర్షితులను చేసి రాడికల్స్ గా మార్చడమే వీళ్లపని. మతం మార్పిడి ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని ఏర్పాటు చేసుకున్నారు నిందితులు. మతం మార్చుకున్న వారి ప్రసంగాలు, వీడియోలు ఇందులో ఉన్నాయి.

హైదరాబాద్ నుంచే మొత్తం శిక్షణ ఇచ్చినట్టు దర్యాప్తులో భయటపడింది. భాగ్య నగర శివారు ప్రాంతం అయిన వికారాబాద్ అడవుల్లో శిక్షణ ఇచ్చినట్ట సమాచారం. అరెస్టు అయిన వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికి సంబంధించిన వ్యక్తులు ఉండటం చూస్తే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది.

ప్రస్తుతానికి ఇమ్రాన్ ఇంటి సీసీ ఫుటేజ్ ను ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటికి ఎవరెవరు వచ్చిపోయారనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇమ్రాన్ ఇంట్లో మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్ ఇల్లు కేంద్రంగానే ఏమైనా కుట్రలకు పాల్పడ్డారా అనే కోణంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..