హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నీచర్‌ గోదాములో చెలరేగిన మంటలు..

|

Jun 17, 2023 | 7:05 AM

సమాచారం మేరకు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఫర్నిచర్ వేర్ హౌస్ లో పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నీచర్‌ గోదాములో చెలరేగిన మంటలు..
Fire In Hyderabad
Follow us on

Fire Broke Out : హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున వనస్థలిపురంలోని విడెమ్స్ స్కిల్స్ షోరూంలో మంటలంటుకున్నాయి. బట్టల షోరూమ్‌లో చెలరేగిన మంటలు ఆ పక్కనే ఉన్న ఫర్నీచర్ గోదాంలోకి వ్యాపించాయి. అది ఫర్నిచర్ వేర్ హౌస్ కావటంతో మంటలు మరింతగా వ్యాపించాయి. దట్టమైన పొగలు, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు,అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం మేరకు.. హుటాహుటిన 5ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఫర్నిచర్ వేర్ హౌస్ లో పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ శ్రీనయ్య మాట్లాడుతూ.. వనస్థలిపురం పనామా గోడౌన్ సమీపంలోని విడమ్స్ సిల్క్స్ అండ్ ఫర్నిచర్ లో మంటలు చెలరేగినట్టుగా చెప్పారు. సమాచారం మేరకు డిఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పారు. దాదాపు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. ఎలాంటి ఫైర్‌ సెఫ్టీ నిబంధనలు పాటించకుండా నడిపిస్తున్న ఫర్నిచర్ గోడౌన్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని చెప్పారు. కాగా, ప్రమాద తీవ్రత కారణంగా ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందో అంచనావేయలేమన్నారు. కాకపోతే, పక్కనే ఉన్న ఇతర గోడౌన్‌లకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..