Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో ఏకాదశ రుద్ర మహాగణపతి.. కర్ర పూజ చేసిన ఉత్సవ కమిటీ సభ్యులు..

|

Jun 22, 2021 | 7:57 AM

Khairatabad Ganesh: వినాయక చవితి సమీపిస్తుండటంతో హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందుకు అవసరమైన...

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో ఏకాదశ రుద్ర మహాగణపతి.. కర్ర పూజ చేసిన ఉత్సవ కమిటీ సభ్యులు..
Khairatabad Ganesh
Follow us on

Khairatabad Ganesh: వినాయక చవితి సమీపిస్తుండటంతో హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందుకు అవసరమైన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే నిర్జల ఏకాదశి సందర్భంగా సోమవారం నాడు ఉత్సవ కమిటీ నిర్వాహకులు గణపతి ప్రాంగణంలో ఆనవాయితీగా షెడ్డు నిర్మాణం కోసం కర్ర పూజ నిర్వహించారు. ఈ ఏడాది ఖైరతాబాద్‌ గణేశుడు.. శ్రీ ఏకాదశ రుద్ర మహా గణపతిగా ముస్తాబై పూజలందుకోనున్నాడు. గౌరీభట్ల విఠలశర్మ సిద్ధాంతి సూచన మేరకు ఏకాదశ రుద్ర మహా గణపతి ప్రతిష్ఠాపనకు నిర్ణయించినట్లు శిల్పి రాజేంద్రన్‌, ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌ తెలిపారు. కాగా, ఈ సారి ఖైరతాబాద్ గణేషుడిని 27 అడుగుల ఎత్తుతో చేయాలని భావిస్తున్నామని కమిటీ నిర్వాహకులు తెలిపారు. అయితే, పోలీసు అనుమతులు, కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎత్తుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కర్ర పూర్తయిన నేపథ్యంలో.. సెప్టెంబర్‌ 10కల్లా గణపతిని పూజలకు సిద్ధం చేస్తామని ఉత్సవ కమిటీ పేర్కొంది.

కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గతేడాది ఖైరతాబాద్ గణేషుడి ఎత్తును 9 అడుగులకే పరిమితం చేశారు. కోవిడ్ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా రూపొందించారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు. ఈసారి మాత్రం విగ్రహం ఎత్తు 27 అడుగుల మేర ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే, ఇదే ఫైనల్ నిర్ణయం కాదని, అందరితో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.

Also read:

FBO Results: ‘ఎఫ్‌బీవో’ పరీక్ష ఫలితాలు విడుదల.. 340 మంది అభ్యర్థుల ఎంపిక.. మిగత పోస్టుల ఎంపిక ఎప్పుడంటే..