ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని ఎన్నిసార్లు పోలీసులు హెచ్చరిస్తున్నా, జనం మాత్రం ఆకర్షణీయమైన ప్రకటనలకు బలవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను చూసి ఆశపడిన వైద్యులకు నిరాశ ఎదురైంది. ఫేస్ బుక్ వేదికగా లో వచ్చిన రెండు ప్రకటనలను చూసి ట్రాప్‌లో పడ్డాడు. ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని ఆశపడ్డాడు. చివరికి నిండా మునిగారు.
ఫేస్‌బుక్ ద్వారా సర్జన్‌ను ట్రాప్ చేశారు సైబర్ నేరగాళ్లు. www.coinmarket.win లో పెట్టుబడులు పెట్టాలని బాధితుడుని నమ్మించారు. ఇది నిజమే అని నమ్మిన బాధితుడు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి కొంత మేర లాభాలు పొందాడు. మొదట నగదును విత్ డ్రా చేసుకున్నాడు..రోజుల పెరిగే కొద్ది పెద్ద మొత్తంలో డబ్బును ఇన్వెస్ట్ చేశాడు. దీంతో ట్రేడింగ్ వాలెట్ లో ఎక్కువ లాభాలు చూపించినా, విత్ డ్రా ఆప్షన్ ను నిలిపివేశారు.
ఈ వ్యవహారం నడుస్తున్న క్రమంలోనే అదే ఫేస్‌బుక్‌లో మరో ట్రేడింగ్ ప్రకటనను గమనించాడు. www.pbexaiz.vip ద్వారా పెట్టుబడి పెట్టాడు. అందులో కూడా పెద్ద మొత్తంలో ప్రాఫిట్ చూపించిన తర్వాత విత్ డ్రా ఆప్షన్ చూపించకపోవడంతో మోసపోయినని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తాను విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ వీలు కాకపోవటంతో మోసపోయానని గ్రహించాడు. ఇక చేసేదీలేక పోలీసులను ఆశ్రయించాడు.
వెబ్‌సైట్ లింకుల ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఆన్‌లైన్‌లో వచ్చే ఎలాంటి ప్రకటనలను నమ్మవద్దని మరోసారి ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈజీ మనీ కోసం ఎవరు కూడా అలాంటి ప్రకటనలను చూసి మోసపోవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ యాప్‌లతో మోసపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఆన్‌లైన్ సోషల్ మీడియా వేదికగా వచ్చే ఇలాంటి ప్రకటనలను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా సైబర్ క్రైమ్ కు గురవుతే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…