AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon: ఇది మాములు కూల్ న్యూస్ కాదు.. పుష్కలంగా వానలు మోసుకొస్తున్న నైరుతి

నైరుతి రుతుపవనాలు పుష్కలంగా వర్షాలను మోసుకొస్తున్నాయి. గతేడాది ఊరించి ఉసూరు మనిపించినా.. ఈసారి తగ్గేదిలే అనేలా ఉన్నాయట. మరోవైపు..ఎల్ నినో నిష్క్రమించి.. లానినా ఏర్పడబోతోంది. దీని ఎఫెక్టుతో ఈ రైనీ సీజన్లో జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా లానినా ఉంటుందని.. పుష్కలంగా వానలు కురిపిస్తుందని అంటున్నారు.

Monsoon: ఇది మాములు కూల్ న్యూస్ కాదు.. పుష్కలంగా వానలు మోసుకొస్తున్న నైరుతి
Weather Report
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2024 | 6:21 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో గతేడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈసారి మాత్రం సీజన్ ఆరంభంలోనే ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కేరళలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు తొలకరిజల్లులు పలకరించాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా, హిందూ మహాసముద్రంలో ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ పాజిటివ్‌గా మారతుండడం నైరుతి రుతుపవనాలకు అనుకూలమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీని ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాల్లో మాంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. భారతదేశ వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయంటున్నారు. ఈసారి లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడటం వంటి కారణాలతో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

వాస్తవానికి రుతుపవనాల సీజన్ దాదాపుగా 120 రోజులపాటు ఉంటుంది. రెమాల్ తుపాను కూడా బంగ్లాదేశ్ వైపు మరలిపోవడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. గతేడాది సరైన వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతన్నలకు ఈసారి గుడ్ న్యూస్ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో సాధారణ వర్షపాతాన్ని మించి వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతట ఈసారి వర్షాలు పుష్కలంగా కురుస్తాయని వాతావరణ విభాగం చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు.

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ‘ఎల్‌ నినో’ దశ ముగిసిపోతోందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. దాని స్థానంలో జులై- సెప్టెంబరులో ‘లా నినా’ ఏర్పడటానికి అవకాశం ఉందని వివరించింది. దీనివల్ల రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది జూన్‌-ఆగస్టులో తటస్థ పరిస్థితులు నెలకొనడానికి గానీ లానినా ఏర్పడటానికి గానీ అవకాశాలు 50 శాతం వరకూ ఉన్నాయని వివరించింది. లానినాకు జులై నుంచి సెప్టెంబరు మధ్య 60 శాతం, ఆగస్టు నుంచి నవంబరు మధ్య 70 శాతం మేర అవకాశాలు ఉన్నాయని వాతావరణ సంస్థ తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..