Hyderabad City: భాగ్యనగరంలో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. ఛాన్స్ దొరికితే చాలు.. దోచుకునేందుకు రెడీ అయిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో భారీ మోసం బయటపడింది. నకిలీ పత్రాలు పెట్టి ఏకంగా రూ. 1.39 కోట్లు మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ రంగప్రవేశం చేసి.. కూపీ లాగడంతో మాయగాళ్ల గుట్టు రట్టు అయ్యింది. ఈ కేసులో ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జెనెరేషన్ ప్రోగ్రాం స్కీమ్ కింద ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఎనిమిది మంది పేరిట లోన్ తీసుకున్నారు.
అయితే, ఈ లోన్ తీసుకోవడం కోసం నకిలీ ఇన్వాయస్‌లు, నకిలీ అగ్రిమెంట్లతో 8 మంది లోన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ రీజినల్ మేనేజర్ ఆలస్యంగా గుర్తించారు. జరిగిన మోసాన్ని గుర్తించిన మేనేజర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మోసానికి పాల్పడిన వ్యక్తుల కూపీ లాగారు. ఇందులో భాగంగా ఈ కేసులో కీలక సూత్రధారి అయిన హైదరాబాద్‌కి చెందిన శ్రీనివాస్ నాయక్‌తో పాటు.. రవి అనే మరో వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read:
Nara Lokesh: పోకిరి సినిమాలో బ్రహ్మానందంలా చేశాడు..!! జగన్ పై లోకేష్ సెటైర్లు..!! వీడియో
Faria Abdullah: డ్యాన్స్‌తో అదరగొట్టిన ఫరియా అబ్ధుల్లా.. చిట్టి ఆటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..